IPL : కుప్పకూలిన ఢిల్లీ..హైదరాబాద్ టార్గెట్-130

IPL : కుప్పకూలిన ఢిల్లీ..హైదరాబాద్ టార్గెట్-130

ఢిల్లీ : హైదరాబాద్ తో జరుగుతున్నమ్యాచ్ లో ఢిల్లీ ఇన్నింగ్స్ ముగిసింది. SRH  బౌలర్ల దెబ్బకు తక్కువ స్కోరుకే కుప్పకూలింది ఢిల్లీ. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 129 రన్స్ చేసింది.  ఢిల్లీ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌(43) ఒంటరి పోరాటం చేశాడు. మిగతా ప్లేయర్లు ఎవరూ రాణించలేకపోవడంతో ..తక్కువ స్కోరుకే పరిమితమైంది ఢిల్లీ.

హైదరాబాద్ బౌలర్లలో..భువనేశ్వర్ కుమార్, సిద్ధార్థ్ కౌల్, మహ్మద్ నబి తలో 2 వికెట్లు తీయగా..రషీద్ ఖాన్, సందీప్ శర్మ చెరో వికెట్ తీశారు.