IPL2023 : ఐపీఎల్.. ఇండియన్ క్రికెటర్ల జీతాలు రూ.2 వేల 354 కోట్లు

IPL2023 : ఐపీఎల్.. ఇండియన్ క్రికెటర్ల జీతాలు రూ.2 వేల 354 కోట్లు

IPL.. ఇండియన్ ప్రీమియర్ లీగ్.. ప్రపంచంలోనే ధనికమైన క్రికెట్ లీగ్.. ఎంతలా అంటే ఇప్పటి వరకు ఏ క్రీడలోనూ.. ఆటగాళ్లకు ఇంత పెద్ద మొత్తంలో జీతాలు ఇచ్చింది లేదు. 2023 ఐపీఎల్ లీగ్ వరకు.. అన్ని దేశాల్లోని ఆటగాళ్ల కంటే.. ఇండియన్ క్రికెటర్లు అత్యధికంగా జీతాల రూపంలో తీసుకోవటం విశేషం. 

ఐపీఎల్ 2008లో ప్రారంభం అయ్యింది. అన్ని ఫ్రాంచైజీస్ ఇప్పటి వరకు 426 మంది ఇండియన్ క్రికెటర్లతో అగ్రిమెంట్ చేసుకుంది. వీరికి కేవలం జీతాల రూపంలోనే 2 వేల 354 కోట్ల రూపాయలు చెల్లించింది. ఇది ఇండియన్ క్రికెటర్లకు చెల్లించిన జీతాలు మాత్రమే. అన్ని జట్లలోని ఆటగాళ్లకు చెల్లించిన జీతాలను తీసుకుంటే.. ఇండియన్ క్రికెటర్లకు చెల్లించిన వాటా 55 శాతంగా ఉంది. 16 సార్లు ఐపీఎల్ జరగ్గా.. ఐపీఎల్ ద్వారా ఇండియన్ క్రికెటర్ల 2 వేల 354 కోట్ల రూపాయలను జీతాల రూపంలో తీసుకోవటం విశేషం. జీతాల ర్యాంకింగ్ లో ఇండియా ఫస్ట్ ప్లేస్ లో ఉంది.

సెకండ్ ప్లేస్ లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఉన్నారు. ఇప్పటి వరకు 84 మంది ఆటగాళ్లు ఐపీఎల్ ఆడగా.. 653 కోట్ల రూపాయలు జీతాల రూపంలో తీసుకున్నారు. ఐపీఎల్ ప్రాంచైజీస్ మొత్తం జీతాల్లో ఇది 15 శాతంగా ఉంది. ఆ తర్వాత స్థానం సౌతాఫ్రికా. 52 మంది క్రికెటర్లు ఐపీఎల్ ఆడగా.. 428 కోట్ల రూపాయలు జీతంగా తీసుకున్నారు. నాలుగో స్థానంలో వెస్టిండీస్ ఆటగాళ్లు ఉన్నారు. 26 మంది ప్లేయర్లు ఐపీఎల్ ఆడగా.. 278 కోట్ల రూపాయలను జీతంగా తీసుకున్నారు. 

ఈ లెక్కలు అన్నీ ఐపీఎల్ ప్రాంచైజీస్ అధికారికంగా చెల్లించిన జీతాలు మాత్రమే. అంతే కాకుండా అడ్వటైజింగ్ ద్వారా, ప్రమోషన్స్ ద్వారా సంపాదించేది అదనం.. ఈ జీతాలు చూస్తుంటే.. ఐపీఎల్ లో అడుగు పెట్టిన ప్రతి క్రికెటర్ కోటీశ్వరుడు అయ్యాడనేది లెక్కలతోనే తేలిపోయింది.. ఐపీఎల్ నా.. మజాకానా...