
ఇరు జట్లలో భారీ హిట్టర్లు
మరో సిక్స్ హిట్టింగ్ కాంటెస్ట్ మ్యాచ్
షార్జా: ఐపీఎల్ –13లో మరో ఆసక్తికర సమరం అభిమానులను కనువిందు చేయనుంది. ఫస్ట్ ఫైట్ లోనే పటిష్ట చెన్నైకి చెక్ పెట్టిన రాజస్తాన్ రాయల్స్ ఆదివారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తో పోటీ పడనుంది. ఇప్పటికే సంజూ శాంసన్, కెప్టెన్ స్టీవ్ స్మిత్ సూపర్ ఫామ్ లో ఉండగా.. ఇంగ్లండ్ స్టార్ జోస్ బట్లర్ రాకతో రాయల్స్ బలం మూడింతలైంది. మరోవైపు ఢిల్లీ చేతిలో సూపర్ ఓవర్లో ఓడినా కెప్టెన్ రాహుల్ మెరుపు సెంచరీతో ఆర్‌సీబీని చిత్తుగా ఓడించిన పంజాబ్ గాడిలో పడింది. ఇరు జట్లలో భారీ హిట్టర్లు ఉండడంతో ఈ పోరు మరో సిక్స్ హిట్టింగ్ కాంటెస్ట్ కానుంది. ఫ్యామిలీతో సపరేట్ గా యూఏఈ వచ్చి క్వారంటైన్ రూల్స్ కారణంగా ఫస్ట్ మ్యాచ్ మిస్సైన బట్లర్ .. యంగ్‌స్టర్ యశస్వి జైస్వాల్ తో ఇన్నింగ్స్ ఆరంభించే చాన్సుంది.
కెప్టెన్ స్మిత్ .. బ్యాటింగ్ ఆర్డర్ లో డేవిడ్ మిల్లర్ పొజిషన్ లోకి వెళ్లనున్నాడు. చెననై్ పై భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డ సంజూ డ్రీమ్ ఫామ్ కొనసాగించాలని చూస్తున్నాడు. బౌలింగ్‌లో టామ్ కరన్, జోఫ్రా ఆర్చర్ , రాహుల్ తెవాటియా రాణిస్తే రాయల్స్ కు తిరుగుండదు. ఇక, టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్ గా పేరు తెచ్చుకుంటున్న లోకేశ్ రాహుల్ ఆర్ సీబీపై ఓ రేంజ్ లో చెలరేగి టోర్నీలో హైయ్యెస్ట్ స్కోరు చేసిన ఇండియన్ గా రికార్డు సృష్టించాడు. కెప్టెన్సీలోనూ మంచి మార్కులు కొట్టేస్తున్న అతను ఈ మ్యాచ్ లోనూ అదే ఊపు కొనసాగించాలని చూస్తున్నాడు.ఆర్‌సీబీపై 5 రన్సే చేసిన గ్లెన్ మ్యాక్స్ వెల్ ఫామ్‌లోకి వస్తే బ్యాటింగ్ బలం రెట్టింపు కానుంది. బౌలింగ్‌లో మహ్మద్ షమీ, షెల్డన్ కా ట్రెల్ పేస్‌తో హడలెత్తిస్తుండగా, యంగ్ లెగ్ స్పిన్నర్స్ రవి బిష్నోయ్, మురుగన్ అశ్విన్ సత్తా చాటుతున్నారు.