ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ సమయంలో మార్పు

ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ సమయంలో మార్పు

ఈ సీజన్ ఐపీఎల్ మంచి కిక్కించిందంటున్నారు క్రికెట్ అభిమానులు. టాప్ టీమ్స్ ఓడి పోవడం.. చిన్న టీమ్ లు పాయింట్ టేబుల్ లో టాప్ లో ఉండటం చూశాం. చూస్తుండగానే ఐపీఎల్‌-2022 ముంగిపు దశకు చేరుకుంటోంది. ఇప్పటికే రెండు ప్లే ఆఫ్‌ బెర్తులు ఖరారు కాగా.. మూడు, నాలుగు స్థానాల కోసం ఆసక్తికర పోటీ నెలకొంది. ఇదిలా ఉండగా.. ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌ టైమింగ్‌ను మార్చినట్లు తెలుస్తోంది. రాత్రి ఏడున్నర గంటలకు ప్రారంభమవ్వాల్సిన మ్యాచ్‌ను 8 గంటలకు ప్రారంభించనున్నట్లు సమాచారం. ఎడిషన్‌ ముగింపు వేడుకలను నిర్వహించే క్రమంలో మ్యాచ్‌ వేళలో ఈ మార్పు చేసినట్లు క్రిక్‌బజ్‌ కథనం వెల్లడించింది. ఇందులోని వివరాల ప్రకారం.. సాయంత్రం ఆరున్నర గంటల నుంచి ఏడు గంటల ఇరవై నిమిషాల వరకు బాలీవుడ్‌ తారలతో కార్యక్రమాలు నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. 

ఈ క్రమంలో ఏడున్నరకు టాస్‌ వేస్తే.. ఎనిమిదింటి నుంచి మ్యాచ్‌ స్టార్ట్ కానుంది.క మే 24 నుంచి ప్లే ఆఫ్‌ మ్యాచ్‌లు మొదలుకానున్నాయి. కోల్‌కతాలో ఫస్ట్‌ క్వాలిఫైయర్‌, ఎలిమినేటర్‌ మ్యాచ్‌లు జరుగనుండగా.. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఫైనల్‌ జరుగనుంది. ఇప్పటికే కొత్త ఫ్రాంఛైజీలు గుజరాత్‌ టైటాన్స్‌, లక్నో సూపర్‌జెయింట్స్‌ ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టాయి. ఈ లోపు గెలుపోటములతో ఏఏ టీమ్స్ పోటీ పడుతాయో చూడాలి.

మరిన్ని వార్తల కోసం..

RRRపై వెనక్కి తగ్గిన జీ5..ఎక్స్ ట్రా మనీ అవసరం లేదు

చనిపోయి బతికింది..ఐదుగురికి బతుకునిచ్చింది

కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో తారల తళుకులు