ఈ వారం 11 ఐపీఓలు ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. రూ.7,055 కోట్లు సేకరించే ప్లాన్‌‌‌‌‌‌‌‌

ఈ వారం 11 ఐపీఓలు ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. రూ.7,055 కోట్లు సేకరించే ప్లాన్‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: ఈ వారం 11 మెయిన్‌‌‌‌‌‌‌‌ బోర్డ్ ఐపీఓలు ఇన్వెస్టర్ల ముందుకు రానున్నాయి. రూ.7,055 కోట్లను సేకరించనున్నాయి. ఈ లిస్ట్‌‌‌‌‌‌‌‌లో ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ రెంటల్ ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫామ్ రెంటోమోజో, కరమ్‌ ‌‌‌‌‌‌‌తారా ఇంజనీరింగ్, మనోహర్ ఎలక్ట్రికల్స్ వంటి సంస్థలు ఉన్నాయి.

సెప్టెంబర్ 7 నుంచి సెప్టెంబర్ 15 మధ్య ఈ ఐపీఓలు మార్కెట్లోకి రానుండగా, అత్యధిక శాతం ఇష్యూలు మంగళ, బుధవారాల్లో సబ్‌‌‌‌‌‌‌‌స్క్రిప్షన్ కోసం  ఓపెన్‌‌‌‌‌‌‌‌ కానున్నాయి.

ఐపీఓల వివరాలు..
* ప్రణవ్ కన్‌‌‌‌‌‌‌‌స్ట్రక్షన్స్ ఇష్యూ సెప్టెంబర్ 7న ప్రారంభమై, 9 న ముగుస్తుంది.  సైజ్‌‌‌‌‌‌‌‌ రూ.351 కోట్లు.  ప్రైస్ బ్యాండ్‌‌‌‌‌‌‌‌ రూ.118 -– రూ.124.

* కనోహర్ ఎలక్ట్రికల్స్, ప్రసోల్ కెమికల్స్, గ్లాస్ వాల్ సిస్టమ్స్ ఐపీఓలు  సెప్టెంబర్ 8,9,10 తేదీల్లో ఓపెన్‌‌‌‌‌‌‌‌లో ఉంటాయి. కనోహర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇష్యూ సైజు రూ.1,056 కోట్లు. ప్రైస్ బ్యాండ్ రూ.601– - రూ.632. ప్రసోల్‌‌‌‌‌‌‌‌ కెమికల్స్  ఇష్యూ సైజ్‌‌‌‌‌‌‌‌ రూ.500 కోట్లు. ప్రైస్ బ్యాండ్ రూ.643 -–రూ.676. గ్లాస్ వాల్ సిస్టమ్స్‌‌‌‌‌‌‌‌ ఐపీఓ సైజు రూ.428 కోట్లు. ప్రైస్ బ్యాండ్ రూ.172 -–రూ.182.

* రెంటోమోజో, కరమ్‌‌‌‌‌‌‌‌తారా ఇంజనీరింగ్, మణిపాల్ పేమెంట్, ఆర్సిల్, ఎల్‌‌‌‌‌‌‌‌సీసీ ప్రాజెక్ట్స్, స్టీమ్‌‌‌‌‌‌‌‌హౌస్ ఇండియా ఐపీఓలు  ఈ నెల  9న ఓపెనై, 11 న ముగుస్తాయి. రెంటోమోజో  ఇష్యూ సైజు రూ.1,256 కోట్లు. ప్రైస్ బ్యాండ్ రూ.384–- రూ.404.


* కరమ్‌‌‌‌‌‌‌‌తారా ఇష్యూ సైజు రూ.875 కోట్లు. ప్రైస్ బ్యాండ్ రూ.241– రూ.254.  మణిపాల్ పేమెంట్ ఐపీఓ సైజు రూ.805 కోట్లు. ప్రైస్ బ్యాండ్ రూ.322 –- రూ.339. 

* ఆర్సిల్ పూర్తిగా ఓఎఫ్‌‌‌‌‌‌‌‌ఎస్ ద్వారా రూ.733 కోట్లు సేకరించనుంది. ప్రైస్ బ్యాండ్ రూ.132 – రూ.139. ఎల్‌‌‌‌‌‌‌‌సీసీ ప్రాజెక్ట్స్ ఇష్యూ సైజు రూ.427 కోట్లు. ప్రైస్ బ్యాండ్ రూ.139-రూ.146. స్టీమ్‌‌‌‌‌‌‌‌ హౌస్ ఇండియా  ఇష్యూ సైజు రూ.414 కోట్లు.

* వీగాల్యాండ్ డెవలపర్స్ ఐపీఓ  సెప్టెంబర్ 10న ప్రారంభమై సెప్టెంబర్ 15న ముగుస్తుంది. ఫ్రెష్  షేర్ల అమ్మకం ద్వారా రూ.210 కోట్లు సమీకరించనుంది. 

* ఆగస్టులో వచ్చిన 23 ఇష్యూలు, ఈ నెల ప్రారంభంలో  వచ్చిన రెండు ఇష్యూలు, తాజా 11 ఐపీఓలతో కలిపి 2026లో ఇప్పటివరకు మార్కెట్లోకి వచ్చిన మొత్తం ఐపీఓల సంఖ్య 75కి చేరనుంది.