జావా నుంచి మరో కొత్త మోడల్ బైక్.. ఆల్‌‌‌‌స్టార్స్ 42 బాబర్ లాంచ్‌‌‌‌

జావా నుంచి మరో కొత్త మోడల్ బైక్.. ఆల్‌‌‌‌స్టార్స్ 42 బాబర్ లాంచ్‌‌‌‌

క్లాసిక్ లెజెండ్స్‌‌‌‌కు చెందిన జావా యెజ్డీ మోటార్‌‌‌‌ సైకిల్స్ తమ సరికొత్త ‘జావా ఆల్‌‌‌‌స్టార్స్ 42 బాబర్’ను మార్కెట్లోకి తెచ్చింది. గ్లోబల్ చెస్ లీగ్ 2026 వేదికగా ఆనంద్ మహీంద్రా దీనిని ఆవిష్కరించారు. ప్రారంభ ధర రూ.2.09 లక్షలు (ఎక్స్-షోరూమ్).

ఈ మోడల్ 334సీసీ లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌‌‌‌తో (29 హెచ్‌‌‌‌పీ పవర్, 30.01 ఎన్‌‌‌‌ఎం టార్క్), 6-స్పీడ్ గేర్‌‌‌‌బాక్స్‌‌‌‌తో వస్తోంది. చెకర్డ్ గ్రాఫిక్స్, ఫ్లోటింగ్ సింగిల్-సీట్ డిజైన్‌‌‌‌తో పాటు బ్లాక్ మిర్రర్, సిల్వర్ నైట్ సహా ఆరు సరికొత్త రంగుల్లో లభించనుంది. డ్యూయల్ ఛానల్ ఏబీఎస్‌‌‌‌తో కూడిన డిస్క్ బ్రేకులు ఇందులో ఉన్నాయి.