ఘనంగా 10 వ ఆర్థ్రోప్లాస్టీ ఆర్థ్రోస్కోపీ సదస్సు

ఘనంగా 10 వ ఆర్థ్రోప్లాస్టీ ఆర్థ్రోస్కోపీ సదస్సు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: అపోలో హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ‘10వ ఆర్థ్రోప్లాస్టీ ఆర్థ్రోస్కోపీ సదస్సు 2026’ జూబ్లీహిల్స్‌‌‌‌లో ఘనంగా జరిగింది. తెలంగాణ ఆర్థోపెడిక్ సర్జన్స్ అసోసియేషన్ (టీఓఎస్ఏ), ట్విన్ సిటీస్ ఆర్థోపెడిక్ సొసైటీ (టీసీఓఎస్) సహకారంతో దీనిని  నిర్వహించారు.

ఆరు రాష్ట్రాల నుంచి 250 మందికి పైగా ఆర్థోపెడిక్ సర్జన్లు హాజరైన ఈ సదస్సులో రోబోటిక్ మోకాలి మార్పిడి, ఏసీఎల్ లిగమెంట్ కీహోల్ విధానాలు, భుజం శస్త్రచికిత్సలపై లోతుగా చర్చించారు.

ముదిరిన ఆర్థరైటిస్‌‌‌‌కు తాత్కాలిక ఇంజెక్షన్ల కంటే శస్త్ర చికిత్సే సరైన పరిష్కారమని నిపుణులు స్పష్టం చేశారు. రోబోటిక్ టెక్నాలజీ, సింథటిక్ లిగమెంట్లు వంటి ఆధునిక పద్ధతులను భారతీయ రోగులకు అందుబాటు ధరల్లో, శాస్త్రీయ ఆధారాలతో ఎలా అందించాలనే అంశంపై  అపోలో హాస్పిటల్స్ సీనియర్ ఆర్థో అండ్‌‌‌‌ జాయింట్ రీప్లేస్‌‌‌‌మెంట్ సర్జన్లు డాక్టర్ మిథిన్ ఆచి, డాక్టర్ సోమశేఖర్ రెడ్డి  మాట్లాడారు.