
ఐపీఎస్ అధికారి పురాన్ కుమార్ ఆత్మహత్య కేసు కీలక మలుపు తిరిగింది.హర్యానా డీజీపీ శ్రతుజీత కపూర్ ను సెలవుపై పంపారు. కపూర్ ను తొలగించాలని ఐపీఎస్ అధికారి భార్య , దళిత సంఘాల నుంచి ఒత్తిడి పెరుగుతున్న క్రమంలో హర్యానా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఐపీఎస్ అధికారి ఆత్మహత్య ఘటన ప్రభుత్వ వార్షికోత్సవ ర్యాలీ కూడా వాయిదా పడింది.
ఐపీఎస్ అధికారి వై. పురాన్ కుమార్ఆత్మహత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పురాన్‌కుమార్ ఆత్మహత్య తర్వాత హర్యానాలో ఉద్రిక్తత నెలకొంది. పురాన్ కుమార్ ఆత్మహతకు డీజీపీతో సహా 16 మంది ఉన్నతాధికారులు ఐపీఎస్ అధికారులు వేధింపులే కారణమని దళిత సంఘాలు, ఐపీఎస్ భార్య ఆరోపించి డీజీపీ తొలగింపుకు డిమాండ్ చేశారు.
డీజీపీని తొలగించే వరకు అంతిమ సంస్కారాలకు అనుమతి ఇవ్వబోమని పురాన్ కుమార్ భార్య, ఐఎఎస్ అధికారి అమ్నీత్ పి కుమార్ నిరాకరించడంతో కపూర్‌పై చర్య తీసుకోవాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. దాదాపు వారం పాటు ప్రతిష్టంభన కొనసాగింది. ఈ క్రమంలో హర్యానా ప్రభుత్వం వివాదం సద్దుమణిగేందుకు మంగళవారం ( అక్టోబర్ 14) డీజీపీని బలవంతపు సెలవులపై పంపినట్లు తెలుస్తోంది.
ఐపీఎస్ అధికారి పురాన్ కుమార్ ఆత్మహత్యతో ఉద్రిక్తత పెరుగుతుండటంతో షైనీ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా శుక్రవారం జరగాల్సిన మెగా వార్షికోత్సవ సమావేశం, జన్ విశ్వాస్, జన్ వికాస్ ర్యాలీ రద్దు చేశారు. ప్రధాని మోదీ ఈ ర్యాలీలో పాల్గొని ప్రసంగించాల్సి ఉంది.