
తప్పుడు ఆరోపణలపై తనపై కేసు నమోదు చేశారని సీనియర్ ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ చెప్పారు. తనపై నమోదైన కేసు విచారణ కోసం పోలీసుల ముందు హాజరయ్యానని తెలిపారు. త్వరలో అన్ని వాస్తవాలు బయటకు వస్తాయన్నారు.
తాను ఎలాంటి తప్పు చేయలేదని, సివిల్ మ్యాటర్ విషయం కోర్టులో ఉందన్నారు. సీసీఎస్ పోలీసులు వివరాల కోసం తనను పిలిచారని తెలిపారు. తన దగ్గర ఉన్న సమాచారం పోలీసు అధికారులకు ఇచ్చానన్నారు. 2020 సంవత్సరం నుండి ఈ వివాదం నడుస్తోందన్నారు. గురువారం (డిసెంబర్ 28న) అన్ని వివరాలు వెల్లడిస్తానని చెప్పారు. తనపై నమోదైన కేసు విషయంలో న్యాయపరంగా ముందుకు వెళ్తానన్నారు.
ఇల్లు కబ్జా ఆరోపణలపై సీనియర్ ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్‌ను సీసీఎస్ పోలీసులు బుధవారం (డిసెంబర్ 27న) అదుపులోకి తీసుకున్నారు.