అమెరికా యుద్ధనౌకపై ఇరాన్ క్షిపణి దాడి..!

అమెరికా యుద్ధనౌకపై ఇరాన్ క్షిపణి దాడి..!

దుబాయ్/కువైట్/ టెహ్రాన్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరుకున్నాయి. అమెరికాకు చెందిన అత్యంత శక్తివంతమైన విమాన వాహక నౌక యూఎస్‌‌ఎస్ అబ్రహాం లింకన్ లక్ష్యంగా ఇరాన్ క్షిపణి దాడులకు తెగబడింది. ఈ నౌక కదలికలను నిరంతరం గమనిస్తున్నామని హెచ్చరించిన కేవలం గంట వ్యవధిలోనే ఇరాన్ ఈ దాడికి పాల్పడటం గమనార్హం. దీనికి సంబంధించిన వీడియోను ఇరాన్ అధికారిక మీడియా విడుదల చేసింది.

మరోవైపు, పొరుగు దేశమైన కువైట్ పైనా ఇరాన్ డ్రోన్లతో విరుచుకుపడింది. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంపై జరిగిన డ్రోన్ దాడిలో ఒక ఇంధన ట్యాంకర్ పేలిపోయి భారీగా మంటలు చెలరేగాయి. కువైట్ రక్షణ దళాలు మరికొన్ని క్షిపణులను, డ్రోన్లను అడ్డుకున్నప్పటికీ, విమానాశ్రయ ప్రాంతంలో దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఈ ఘటనలో ఎవరికీ ప్రాణనష్టం కలగలేదని కువైట్ అధికారులు ధృవీకరించారు.

అమెరికా ఎఫ్-18 జెట్‎ను కూల్చేశాం: ఇరాన్

యుద్ధంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. దక్షిణ ఇరాన్‌‌లోనిచాబ హార్ ప్రాంతంలో గగనతల నిఘా నిర్వహిస్తున్న అమెరికాకు చెందిన ఎఫ్​-18 ఫైటర్ జెట్‌‌ను తమ క్షిపణి వ్యవస్థల ద్వారా విజయవంతంగా కూల్చివేసినట్లు ఇస్లామిక్​రివల్యూషనరీ గార్డ్స్ కోర్ (ఐఆర్ జీసీ) ప్రకటించింది. 

గత కొన్నిరోజులుగా అమెరికా యుద్ధ నౌకలు, డ్రోన్లే లక్ష్యంగా దాడులు చేస్తున్న ఇరాన్, ఇప్పుడు ఏకంగా అత్యాధునిక యుద్ధ విమానాన్ని లక్ష్యంగా చేసుకోవడం ఉద్రిక్తతలను మరింత పెంచింది. అయితే ఈ ఘటనపై అమెరికా రక్షణ శాఖ (పెంటగాన్) నుంచి ఇంకా అధికారిక ధృవీకరణ రావాల్సి ఉంది.