దుబాయ్: ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న ఎయిర్‌స్ట్రయిక్స్‌కు మద్దతుగా దేశంలో ఎవరైన మాట్లాడినా, ఏమైనా చేసినా.. వారిని ఎట్టిపరిస్థితుల్లో వదిలిపెట్టబోమని ఇరాన్ జ్యుడీషియరీ చీఫ్ ఘోలం హుస్సెన్ ఎజెహీ హెచ్చరించారు. శత్రు దేశానికి సహకరిస్తున్నారని రుజువైతే మరణశిక్ష విధిస్తామన్నారు. అలాగే, అరెస్టయిన వారు తీవ్రమైన శిక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుందని బుధవారం ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వ్యాఖ్యానించారు.
‘‘అల్లర్ల కేసులకు మేము ప్రాధాన్యత ఇస్తాం. శత్రువుకు ఏ రకంగా సహకరించినా వారిని శత్రువులుగానే పరిగణిస్తాం. గతంలో దేశంలో అల్లర్లు జరిగినప్పుడు ఇదే విషయాన్ని చెప్పాం. ఇప్పుడు ఇదే విషయాన్ని మళ్లీ చెబుతున్నాం. అమెరికా, ఇజ్రాయెల్‌కు మద్దతుగా ఎవరైనా మాట్లాడితే వారు శత్రువుల తరుఫన ఉన్నట్లే. వారికి ఇస్లామిక్ సూత్రాల ప్రకారం శిక్ష ఎదుర్కోవాల్సి ఉంటుంది”అని ఆయన స్పష్టం చేశారు.
