Iran Warning: నీ పని నువ్వు చూసుకో: అమెరికాకు ఇరాన్ డెడ్లీ వార్నింగ్

Iran Warning: నీ పని నువ్వు చూసుకో: అమెరికాకు ఇరాన్ డెడ్లీ వార్నింగ్

హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా మృతితో ఇజ్రాయెల్పై కత్తులు నూరుతున్న ఇరాన్ తాజాగా అమెరికాను తీవ్రంగా హెచ్చరించింది. ఇజ్రాయెల్పై వందలాది మిసైళ్లతో విరుచుకుపడుతున్న ఇరాన్.. అమెరికాను ‘నీ పని నువ్వు చూసుకో’ అనే తరహాలో జోక్యం చేసుకోవద్దని హెచ్చరించింది. ఇజ్రాయెల్పై దాడుల అనంతరం అమెరికాకు ఇరాన్ ఈ డెడ్లీ వార్నింగ్ ఇవ్వడం గమనార్హం. మంగళవారం నాడు (సెప్టెంబర్ 1, 2024) దాదాపు 200 మిసైల్స్తో  ఇజ్రాయెల్పై ఇరాన్ దాడి చేసింది. 

ఇజ్రాయెల్కు అమెరికా ప్రధాన మిత్ర దేశం అనే విషయం తెలిసిందే. ఇజ్రాయెల్కు దౌత్యపరమైన మద్దతు ప్రకటించిన అమెరికా సైనిక సామగ్రిని కూడా అందిస్తూ అండగా నిలుస్తోంది. ఇరాన్ దాడుల్లో ప్రాణ నష్టం గురించి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (IDF) ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మంగళవారం(సెప్టెంబర్ 1, 2024)  రాత్రి 10 గంటల ప్రాంతంలో ఇజ్రాయెల్పై ఇరాన్ ఒక్కసారిగా మిసైళ్ల వర్షం కురిపించింది. ఇందులో కొన్నింటిని ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ అడ్డుకుంది.

ALSO READ | ఎందుకిలా? ఏం జరిగింది? : అప్పట్లో ఇజ్రాయెల్.. ఇరాన్ జాన్ జిగిరీలు.. ఇప్పుడు యుద్ధం

రాకెట్​ దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ తన పౌరులను అప్రమత్తం చేసింది. దీంతో పౌరులు షెల్టర్ హోమ్లలో తలదాచుకున్నారు. మరోవైపు, టెల్ అవీవ్లో టెర్రర్ దాడి జరిగిందని, ఓ దుండగుడు తుపాకీతో కాల్పులు జరిపాడని సమాచారం. ఈ కాల్పుల్లో నలుగురు పౌరులు చనిపోయారని పోలీసులు తెలిపారు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ఈ తరుణంలో ఇజ్రాయెల్కు అమెరికా బేషరతు మద్దతు ప్రకటించింది. 

ఇజ్రాయెల్పై డైరెక్ట్ మిలటరీ అటాక్కు ప్లాన్ చేస్తే ఇరాన్ తీవ్ర పరిణామాలను చవిచూడాల్సి వస్తుందని అమెరికా హెచ్చరించింది. 2023 అక్టోబర్లో గాజా యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇజ్రాయెల్కు అమెరికా భారీగా ఆర్థిక సాయం, సైనిక సామగ్రి సమకూర్చింది. సైనిక సామగ్రి కోసం ఏడాదికి 3.8 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం అమెరికా నుంచి ఇజ్రాయెల్కు అందుతోంది. ఇరాన్ మిసైల్ దాడి నేపథ్యంలో ఇజ్రాయెల్కు సాయంగా రంగంలోకి దిగిన అమెరికా మిసైల్ డిఫెన్స్ వ్యవస్థకు సాయం అందించాలని తమ బలగాలకు ఆదేశాలు జారీ చేసింది.

టెల్ అవీవ్తో పాటు జెరూసలెంలోనూ పేలుళ్ల శబ్దాలు వినిపించాయని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్) ప్రకటించిన విషయం విదితమే. ఇరాన్ మిసైల్స్ను ఐరన్ డోమ్ సమర్థవంతంగా అడ్డుకుంటోందని ఐడీఎఫ్ చెప్పింది. కొన్ని మిసైళ్లు ఇజ్రాయెల్ భూభాగంలో పడ్డాయని పేర్కొంది. ఇప్పటి వరకు ఈ దాడితో ఎలాంటి మరణాలు సంభవించలేదని, కొంతమంది పౌరులకు స్వల్ప గాయాలయ్యాయని ప్రకటించింది. డిఫెన్స్తో పాటు అఫెన్స్కూ ఇజ్రాయెల్​సంసిద్ధంగా ఉందని, ఈ దాడులకు ఇరాన్ ఫలితం అనుభవిస్తుందని ఐడీఎఫ్​ ఓ ప్రకటనలో తెలిపింది.