ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. సదరన్ ఇరాన్ పరిధిలోని మినాబ్ సిటీలోని ఒక ఎలిమెంటరీ స్కూల్పై ఇజ్రాయెల్ బాంబు దాడి చేసింది. ఈ బాంబు దాడిలో ఐదుగురు విద్యార్థినులు చనిపోయారు. చాలా మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది.
🚨🇮🇷🇺🇸🇧🇭 Footage shows Iran's missile attack on U.S. Navy in Bahrain.pic.twitter.com/La7qAHjWAp https://t.co/EldLBrN13I
— Mario Nawfal (@MarioNawfal) February 28, 2026
సదరన్ ఇరాన్లోని హోర్మోజ్‌గాన్ ప్రావిన్స్‌లో మినాబ్ సిటీ ఈ బాంబు దాడులతో వణికిపోయింది. ఇదిలా ఉండగా.. ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాలను కూడా ఇరాన్ టార్గెట్ చేసింది. సౌదీ అరేబియా, అబుదాబితో సహా 8 దేశాలపై ఇరాన్ మిస్సైల్స్తో అటాక్ చేస్తుండటంతో యూఏఈ, బెహ్రెయిన్, ఖతార్, జోర్డాన్, కువైట్ దేశాలు భయంతో వణికిపోతున్నాయి.
JUST IN: Another angle of the Iranian ballistic missile strike on the U.S. naval base in Bahrain. pic.twitter.com/zOXBj7U0q3
— Sulaiman Ahmed (@ShaykhSulaiman) February 28, 2026
బెహ్రయిన్లోని అమెరికా మిలటరీ బేస్పై ఇరాన్ బాంబు దాడులు చేసింది. ఈ దాడి దృశ్యాలు ఇంటర్నెట్లో వైరల్గా మారాయి. ఖతార్ రాజధాని దోహాలో కూడా రెండు ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించినట్లు ఖతార్ రక్షణ శాఖ ధృవీకరించింది. ఇదిలా ఉండగా.. బెహ్రెయిన్, ఖతార్, జోర్డాన్, కువైట్ దేశాలపై ఇరాన్ అటాక్స్ను సౌదీ అరేబియా తీవ్రంగా ఖండించింది. దేశ సార్వభౌమాధికారం, అంతర్జాతీయ చట్ట సూత్రాల ఉల్లంఘన ఇలానే కొనసాగితే ఇరాన్ తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని సౌదీ అరేబియా హెచ్చరించింది.
JUST IN: 🇮🇷🇺🇸 Footage shows moment Iranian missile struck US military base in Bahrain: pic.twitter.com/tF3f5d3r1u
— BRICS News (@BRICSinfo) February 28, 2026
దుబాయ్‌లో కూడా పేలుళ్లు సంభవించాయి. సౌదీ అరేబియాలోని రియాద్పై కూడా ఇరాన్ బాంబు దాడులు చేసింది. ఇరాన్ అటాక్స్ కారణంగా గల్ఫ్ దేశాలు ఇప్పటికే ఎయిర్ స్పేస్ను మూసివేశాయి. అమెరికా దళాలకు ఆశ్రయం కల్పిస్తున్నందుకే గల్ఫ్ దేశాలను ఇరాన్ టార్గెట్ చేసిందని అంతర్జాతీయ మీడియా వర్గాలు తెలిపాయి.
