పాకిస్తాన్ వేదికగా ఏప్రిల్ 10న ఇరాన్-అమెరికా చర్చలు

పాకిస్తాన్ వేదికగా ఏప్రిల్ 10న ఇరాన్-అమెరికా చర్చలు

ఇస్లామాబాద్: మిడిల్ ఈస్ట్‎లో దాదాపు నెలన్నర రోజులుగా సాగుతోన్న అమెరికా-ఇరాన్ యుద్ధానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఇరు దేశాల మధ్య రెండు వారాల పాటు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. సీజ్ ఫైర్ కుదరడంలో పాకిస్థాన్ చక్రం తిప్పింది. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీష్ ప్రతిపాదించిన కాల్పుల విరమణ ఒప్పందానికి అమెరికా, ఇరాన్ అంగీకరించాయి. 

యుద్ధం పూర్తిగా ముగించేందుకు పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా 2026, ఏప్రిల్ 10న అమెరికా, ఇరాన్ బృందాలు ప్రత్యక్ష చర్చలు జరపనున్నాయి. పశ్చిమాసియాలో నెలన్నర రోజులుగా సాగుతోన్న యుద్ధంలో పాకిస్తాన్ క్రియాశీలక పాత్ర పోషించడటం చర్చనీయాంశంగా మారింది.

పాకిస్తాన్ కీ రోల్:

2026, ఫిబ్రవరి 28న పశ్చిమాసియాలో వార్ స్టార్ట్ అయ్యింది. అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‎పై దాడులు చేశాయి. ఇరాన్ కూడా అదే రేంజ్‎లో స్పందించింది. అమెరికా-ఇజ్రాయెల్ ప్రతీకారంగా ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హార్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. 

హార్మూజ్ జలసంధిని తెరవాలని ఇరాన్‎కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏప్రిల్ 7వ తేదీ వరకు గడువు విధించాడు. డెడ్ లైన్ చివరి రోజున పాకిస్తాన్ రంగంలోకి దిగి.. అమెరికా, ఇరాన్‎కు కాల్పుల విమరణ ఒప్పందం ప్రతిపాదించింది. ఈ ఒప్పందానికి అమెరికా, ఇరాన్ రెండు దేశాలు అంగీకరించాయి. రెండు వారాల పాటు కాల్పుల విరమించేందుకు ఒప్పుకున్నాయి.