ఇరాన్ లో మళ్ళీ హిజాబ్ డ్రెస్ కోడ్ .. వీధుల్లోకి ప్రత్యేక పోలీస్ విభాగం

ఇరాన్ లో మళ్ళీ హిజాబ్ డ్రెస్ కోడ్ .. వీధుల్లోకి ప్రత్యేక పోలీస్ విభాగం

ఇరాన్ లో అధికారులు మళ్లీ హిజాబ్ గస్తీలు నిర్వహించడం మొదలు పెట్టారు.  హిజాబ్ సరిగా ధరించని మహిళలను పర్యవేక్షించడానికి  ప్రత్యేక పోలీసుల విభాగం రంగంలోకి దిగింది. మహిళల డ్రెస్సింగ్, శిరోజాల(తలవెంట్రుకలు)ను హిజాబ్ తో కప్పుకున్నారా?  లేదా అంశాలను గల్లీల్లో తిరుగుతూ  పర్యవేక్షించనున్నారు.  నిబంధనలను పాటించని వారిని మొదట హెచ్చరించి తర్వాత ఆదేశాలు పాటించని చర్యలు తీసుకుంటారు. దీన్ని రద్దు చేయాలని గత కొన్ని రోజులుగా మహిళలు డిమాండ్ చేస్తున్నారు. మహిళల డ్రెస్ కోడ్ అమలుపై  ఇరాన్ ప్రభుత్వం 2005లో ప్రత్యేక పోలీస్ విభాగాన్ని ఏర్పాటు చేసింది.

ALSO READ :పీయూ పేరు మార్చం : మంత్రి శ్రీనివాస్ గౌడ్

2022 సెప్టెంబర్ లో మహ్సా అమీని(22) అనే యువతి హిజాబ్ ధరించలేదని ప్రత్యేక పోలీస్ విభాగం పోలీసులు  ఆమెను టెహ్రాన్ లో అరెస్ట్ చేశారు. పోలీసుల కస్టడీలో ఆమె తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో  మరణించింది. దీనిపై అప్పట్లో పెద్ద ఎత్తును  నిరసనలు వ్యక్తమయ్యాయి. ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మహిళలు తలకు హిజాబ్ ధరించకుండా, జుట్టు కత్తిరించుకోకుండా నిరసనలు చేశారు. ఇరాన్ తో పాటు పలు దేశాల్లో కూడా హిజాబ్ కు వ్యతిరేకంగా ఆందోళనలు చేశారు మహిళలు.ఈ ఆందోళనల్లో దాదాపు 500 మంది ఆందోళనకారులు మరణించారు.  సెలబ్రిటీలు, మహిళలు తమ జుట్టును కత్తిరించుకుంటున్న వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తమ మద్దతు తెలిపారు.  ఆ తర్వాత ఇరాన్ ప్రభుత్వం  ప్రత్యేక పోలీస్ విభాగాన్ని రద్దు చేస్తామని చెప్పడంతో ఆందోళనలు తగ్గాయి. కానీ మళ్లీ ఇపుడు డ్రెస్ కోడ్ అమలుపై  ప్రత్యేక పోలీసుల విభాగం గస్తీ నిర్వహించడం మొదలు పెట్టింది.