IRCONలో ఉద్యోగాలు.. ఇవే వివరాలు

IRCONలో ఉద్యోగాలు.. ఇవే వివరాలు

కేంద్ర ప్రభుత్వం వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. నిరుద్యోగులకు మరో తీపి కబురు చెప్పింది.. తాజాగా మరో సంస్థలో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. IRCON లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ ఆన్ లైన్ ద్వారా అప్లై చేసి హార్డ్ కాఫీని పోస్ట్ ద్వారా అడ్రస్ కు పంపించాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ircon.orgని లో దరఖాస్తు చేసుకోవచ్చు..

ఈ ఉద్యోగాలకు సంబంధించిన చివరి తేదీ ఆగస్టు 15 గా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు..దరఖాస్తు ఫారమ్ యొక్క హార్డ్ కాపీని సమర్పించడానికి చివరి తేదీ ఆగస్టు 25 గా నిర్ణయించబడింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 33 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో విభాగాల వారీగా పోస్టులు ఇలా ఉన్నాయి.. 

మొత్తం ఖాళీలు.. 33

  • గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ సివిల్ 13
  • ఎలక్ట్రికల్ 4
  • ఎస్ అండ్ టీ 3
  • టెక్నీషియన్ అప్రెంటీస్ సివిల్ 9
  • ఎలక్ట్రికల్ కే2 ఎస్ అండ్ టీ 2

అర్హతల విషయానికొస్తే.. సంబంధిత సబ్జెక్టులో ఇంజనీరింగ్ టెక్నాలజీ స్ట్రీమ్‌లో గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. అదేవిధంగా, డిప్లొమా అప్రెంటీస్ పోస్ట్ కోసం, అభ్యర్థి తప్పనిసరిగా సంబంధిత సబ్జెక్ట్‌లో డిప్లొమా కలిగి ఉండాలి. గ్రాడ్యుయేట్ మరియు డిప్లొమా ఖాళీలు రెండింటికీ, జూలై 1, 2020న లేదా ఆ తర్వాత కనీస అర్హతను పొందిన అభ్యర్థులు మాత్రమే అర్హులు..

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 18 ఏళ్లు ఉండాలి. గరిష్ట వయస్సు 30 సంవత్సరాలుగా నిర్ణయించబడింది. నిబంధనల ప్రకారం రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఇవ్వబడుతుంది..

జీతం..

గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ అభ్యర్థులకు నెలకు రూ.10,000, డిప్లొమా అప్రెంటీస్ అభ్యర్థులకు నెలకు రూ.8,500 జీతం ఇస్తారు. శిక్షణ వ్యవధి ఒక సంవత్సరం.. ఈ ఉద్యోగాలపై ఆసక్తి కలిగిన వాళ్ళు నోటిఫికేషన్ ను చదివి అప్లై చేసుకోగలరు..