ఇండియా, శ్రీలంక వేదికలుగా జరగనున్న 2026 టీ20 వరల్డ్ కప్ కు ఐర్లాండ్ క్రికెట్ తమ జట్టును ప్రకటించింది. ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న ఈ మెగా సమరానికి 15 మంది సభ్యులతో కూడిన జట్టును శుక్రవారం (జనవరి 9) ప్రకటించింది. సీనియర్ ప్లేయర్ పాల్ స్టిర్లింగ్ కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. వికెట్ కీపర్-బ్యాటర్ లోర్కాన్ టక్కర్‌ను అతనికి డిప్యూటీగా నియమించారు. 2024 టీ20 వరల్డ్ కప్ కు ఎంపికైన జట్టులో 12 మంది స్క్వాడ్ లో ఉన్నారు. జాతీయ సెలెక్టర్ ఆండ్రూ వైట్ ఈ సారి ఎలాంటి భయం లేకుండా ఆతిధ్య శ్రీలంకతో పాటు పవర్ ఫుల్ జట్టు ఆస్ట్రేలియాను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు.
"ఈ టీ20 ప్రపంచ కప్ కోసం మేము చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. 2022 టీ20 వరల్డ్ కప్ తర్వాత 2024లో మా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వలేకపోయాము. ఈ సారి ఎలాంటి తప్పులు చేయకుండా వరల్డ్ కప్ కు సిద్ధమవుతున్నాం. గత 18 నెలలు జట్టు ఎంపిక కోసం కసరత్తులు చేశాము. 2024 వరల్డ్ కప్ స్క్వాడ్ నుండి 15 మంది ఆటగాళ్లలో 12 మంది జట్టులో ఉండటంతో మా జట్టు నిలకడ ఏంటో తెలుస్తుంది. టిమ్ టెక్టర్, బెన్ కాలిట్జ్, మాథ్యూ హంఫ్రీస్ లాంటి టాలెంటెడ్ ఆటగాళ్లను తీసుకున్నాం". అని జట్టు ప్రకటన తర్వాత ఐర్లాండ్ కోచ్ వైట్ చెప్పుకొచ్చారు.
వరల్డ్ కప్ లో ఐర్లాండ్ గ్రూప్ B లో ఉంది. ఇదే గ్రూప్ లో ఆస్ట్రేలియా, శ్రీలంక, ఒమన్, జింబాబ్వే జట్లు ఉన్నాయి. ఒమన్, జింబాబ్వే లపై గెలిచి శ్రీలంక లేదా ఆస్ట్రేలియాలలో ఒక జట్టుకు షాక్ ఇస్తే ఐర్లాండ్ సూపర్-8 కు చేరుకోవచ్చు. ఐర్లాండ్ గ్రూప్ లో తమ అన్ని మ్యాచ్ లు శ్రీలంకలోనే ఆడతుంది. ఫిబ్రవరి 8న కొలంబోలో శ్రీలంకతో తమ తొలి మ్యాచ్ తో వారు వరల్డ్ కప్ ను ప్రారంభించనున్నారు. ఫిబ్రవరి 11 న ఆస్ట్రేలియాతో మ్యాచ్ ఆడాల్సి ఉంది. జనవరి 15న ఇటలీ, యుఎఇలతో జరిగే వార్మప్ టీ20ల సిరీస్ కోసం దుబాయ్‌కు వెళ్లనుంది.
వరల్డ్ కప్ కు ఐర్లాండ్ జట్టు:
పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్), మార్క్ అడైర్, రాస్ అడైర్, బెన్ కాలిట్జ్, కర్టిస్ కాంఫర్, గారెత్ డెలానీ, జార్జ్ డాక్రెల్, మాథ్యూ హంఫ్రీస్, జోష్ లిటిల్, బారీ మెక్‌కార్తీ, హ్యారీ టెక్టర్, టిమ్ టెక్టర్, లోర్కాన్ టక్కర్ (వైస్ కెప్టెన్), బెన్ వైట్, క్రెయిగ్ యంగ్
Ireland bank on familiar faces and experience for their push at the #T20WorldCup 💪
— ICC (@ICC) January 9, 2026
More on their squad ➡️ https://t.co/SEzP3XepHd pic.twitter.com/V9y7jaKfPK
