అఫ్ఘాన్ బౌలర్లను ఉతికారేసిన ఐర్లాండ్

అఫ్ఘాన్ బౌలర్లను ఉతికారేసిన ఐర్లాండ్

 ఐర్లాండ్ క్రికెట్ టీమ్ సంచలన విజయాన్ని నమోదు చేసింది.  అఫ్ఘనిస్థాన్ జట్టును చిత్తు చిత్తుగా ఓడించింది.  టీ20ల సిరీస్‌లో భాగంగా జరిగిన ఫస్ట్ మ్యాచ్లో అఫ్ఘాన్పై  7 వికెట్లతో గెలుపొందింది. దీంతో  మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది.

ముందుగా బ్యాటింగ్ చేసిన అఫ్ఘనిస్థాన్  20 ఓవర్లలో 7 వికెట్లకు 168 పరుగులు చేసింది. ఉస్మాన్ ఘణి  హాఫ్ సెంచరీ చేయగా... ఇబ్రహిమ్ జడ్రాన్ 29 పరుగులతో చెలరేగాడు.  స్టార్ ఆల్‌రౌండర్లు రషీద్ ఖాన్, కెప్టెన్ మహమ్మద్ నబీ విఫలమయ్యారు.  ఐర్లాండ్ బౌలర్లలో మెక్‌కార్తీ మూడు వికెట్లు పడగొట్టగా.. డాక్‌రెల్ రెండు వికెట్లు దక్కించుకున్నాడు. 

169 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన  ఐర్లాండ్ 19.5 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 171 పరుగులు చేసి ఘన విజయం సాధించింది. కెప్టెన్ ఆండ్రూ బాల్‌బిర్నీ 38 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 51పరుగులు, లోర్కాన్ టక్కర్  35 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 50 రన్స్ సాధించారు. చివర్లో  హర్రీ టెక్టర్ 25 పరుగులు,  జార్జ్ డాక్‌రెల్ 10 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చారు. అఫ్ఘాన్ బౌలర్లలో ముజీబ్ ఉర్ రెహ్మాన్, నవీన్ ఉల్ హక్, మహమ్మద్ నబీ చెరో  వికెట్ దక్కించుకున్నారు.  నాలుగు ఓవర్లు వేసిన రషీద్ ఖాన్ 25 పరుగులిచ్చి ఒక్క వికెట్ కూడా పడగొట్టలేదు.