వాట్సప్ కు 2వేల కోట్ల జరిమానా

వాట్సప్ కు 2వేల కోట్ల జరిమానా

వినియోగదారుల వ్యక్తిగత డేటాను ఫేస్‌బుక్‌తో షేర్‌ చేసినందుకు వాట్సప్‌కు ఐర్లండ్ దేశం దాదాపు 2వేల కోట్ల రూపాయల జరిమానా వేసింది. వినియోగదారుల వ్యక్తిగత భద్రత, పారదర్శకతకు సంబంధించిన నిబంధనలను వాట్సప్‌ ఉల్లంఘించిందని భావిస్తూ ఐర్లండ్‌కు చెందిన డేటా ప్రైవసీ కమిషనర్‌ (డీపీసీ) జరిమానా విధించారు. ఈ మేరకు డీసీపీ జారీ చేసిన ఉత్తర్వులు సంచలనం సృష్టిస్తున్నాయి. 
జరిమానాపై వాట్సప్ స్పందించింది. డీపీసీ ఆదేశాలపై తాము అప్పీల్‌కు వెళతామని వాట్సప్‌ ప్రకటించింది. ఐర్లండ్‌కు చెందిన డీపీసీ యూరోపియన్‌ యూనియన్‌లో ఫేస్‌బుక్‌కు సంబంధించి లీడ్‌ డేటా ప్రైవసీ రెగ్యులేటర్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే ఈకేసు 2018కి సంబంధించినది. అప్పటి ఈయూ నిబంధనలను పారదర్శకతకు సంబంధించి వాట్సప్‌ పాటించిందా ?  లేదా ?  అన్న విషయాలను డీపీసీ పరిశీలించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వాట్సప్‌తో పాటు ఫేస్‌బుక్‌ మధ్య డేటా ప్రాసెసింగ్‌కు సంబంధించిన అంశాలను కూడా పరిశీలించినట్లు చెబుతున్నారు.