
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్. లంకన్ ప్రీమియర్ లీగ్(ఎల్‌పీఎల్)లో ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎల్‌పీఎల్‌లో ఆడేందుకు ఆసక్తి వ్యక్తం చేసిన 70 మంది ఫారిన్ క్రికెటర్లలో పఠాన్ కూడా ఉన్నాడని సమాచారం. పైగా, పఠాన్ ఇదివరకే రిటైర్ అవ్వడంతో బీసీసీఐ అతనికి అడ్డు చెప్పే అవకాశం లేదు. గతంలో యువరాజ్ కూడా రిటైర్మెంట్ ప్రకటించి టీ10 లీగ్‌లో ఆడాడు. కాగా, లంక మాజీ ఆల్‌రౌండర్ పర్వేజ్ మహరూఫ్ ఇచ్చిన ఆఫర్ వల్లే ఇర్ఫాన్ లీగ్‌లో ఆడాలని చూస్తున్నాడు. అయితే, ఎల్‌పీఎల్‌లో ఉన్నఐదు ఫ్రాంచైజీల్లో ఏదో ఒక జట్టు పఠాన్‌ను పాపులర్‌ప్లేయర్‌గా ఎంచుకుంటేనే అతను లీగ్‌లో ఉంటాడు. ఆగస్టు 28న ఎల్‌పీఎల్ తొలి ఎడిషన్‌ను ప్రారంభించాలని శ్రీలంక బోర్డు ప్లాన్ చేస్తోంది. ఇందుకు ప్రభుత్వ అనుమతి రావాల్సి ఉంది.