Punjab Kings Conflicts: 18 ఏళ్లలో 12 మంది కెప్టెన్లు.. పంజాబ్ కింగ్స్ జట్టులో అంతర్గత విభేదాలు..

Punjab Kings Conflicts: 18 ఏళ్లలో 12 మంది కెప్టెన్లు.. పంజాబ్ కింగ్స్ జట్టులో అంతర్గత విభేదాలు..

Punjab Kings Conflicts: ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన పంజాబ్ కింగ్స్ టీమ్ అంతర్గత సమస్యలకు సంబంధించిన అంశం మరోసారి తెర పైకి వచ్చింది. ఈసారి మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ చేసిన వ్యాఖ్యలు ఈ విషయాన్ని బహిర్గతం చేశాయి. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌గా ఉన్న టైంలోనే జట్టులో ఉన్న సమస్యలను గుర్తు చేసుకున్నాడు. ముఖ్యంగా టీమ్ యాజమాన్యం, కోచింగ్ స్టాఫ్ మధ్య సమన్వయం లేకపోవడంతోనే జట్టు వెనకబడటానికి ప్రధాన కారణమని వెల్లడించాడు. 

2008లో యువరాజ్ సింగ్ నాయకత్వంలో సెమీఫైనల్ వరకు జట్టు చేరిన, అనంతరం స్థిరత్వంగా తమ పట్టుని కోల్పోయిందని ఇర్ఫాన్ పఠాన్ చెప్పాడు. తొలి సీజన్ తర్వాత కెప్టెన్సీ కొనసాగాల్సింది. కానీ 3వ ఏడాదికి మారిపోయింది. అదే వివాదాలకి దారి తీసిందని పేర్కొన్నారు. యజమానులు, కోచ్‌లు ఇద్దరూ క్రికెట్ హిస్టరీ లేని వారు కావడంతో నిర్ణయాల్లో తేడాలు వచ్చాయి.. ఒక యజమాని ఒక టీమ్ కాంబినేషన్ కోరుకుంటే, మరొకరు ఇంకో ప్లాన్ చెప్పడంతో జట్టులో గందరగోళం ఏర్పడేదన్నారు. 

పంజాబ్ కింగ్స్ యాజమాన్యంలో ప్రీతీ జింటా మెయిన్ రోల్‌గా కనిపించినప్పటికీ మోహిత్ బర్మన్, నెస్ వాడియా, కరణ్ పాల్ కూడా భాగస్వాములుగా కొనసాగుతున్నారు. ఈ పార్ట్‌నర్ల మధ్య సమన్వయం లేకపోవడంతో జట్టు ప్రదర్శనపై తీవ్రంగా ఎఫెక్ట్ పడిందని పఠాన్ అన్నారు. పంజాబ్ కింగ్స్ 18 ఏళ్ల చరిత్రలో ఇప్పటి వరకు  12 మందికి పైగా కెప్టెన్లను మార్చడంతో ప్లేయర్లలో నమ్మకం తగ్గింది, నేరుగా జట్టుపై కూడా ప్రభావం చూపించిందని ఆయన వెల్లడించారు.