
డబ్లిన్: ఐర్లాండ్‌కు చెందిన వ్యక్తి ఏకంగా 2 వేల కోట్లకుపైగా జాక్‌పాట్ కొట్టాడు. లాటరీలో 2,120 కోట్లు గెలుచుకున్నాడు. ఈ విషయాన్ని ఐరిష్ నేషనల్ లాటరీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సియాన్ మర్ఫీ బుధవారం వెల్లడించారు. యూరప్‌లోనే ఇది పెద్ద ప్రైజ్ మనీ అని చెప్పారు. లాటరీ టికెట్‌ను జాగ్రత్తగా ఉంచుకోవాలని, వీలైనంత తొందరగా తమ ప్రధాన కార్యాలయాన్ని సంప్రదించాలని గెలుచుకున్న వ్యక్తిని కోరారు. ఆ లక్కీ విన్నర్ పేరు, వివరాలు మాత్రం త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు. దీంతో జాక్‌పాట్ కొట్టిన వ్యక్తి ఎవరనేదానిపై ఐర్లాండ్‌వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. పెద్దపెద్ద బిజినెస్‌మన్‌లు, సెలబ్రిటీలను మించిన సంపన్న వ్యక్తిగా ఆ లక్కీ విన్నర్ రికార్డుకెక్కనున్నారు.