'ప్రేమకు హద్దులు లేవు'.. ఖైదీతో ప్రేమలో పడ్డ ఐరిష్ మహిళ

'ప్రేమకు హద్దులు లేవు'.. ఖైదీతో ప్రేమలో పడ్డ ఐరిష్ మహిళ

'ప్రేమకు హద్దులు లేవు' అనే మాటను మనం తరచుగా వింటూ ఉంటాం. ఈ విషయాన్ని తాజాగా ఓ ఐరిష్ మహిళ రుజువు చేసినట్లు తెలుస్తోంది. బ్రిడ్జేట్ వాల్ అనే మహిళ రెండో సారి వివాహం చేసుకోవడానికి సిద్ధమైంది. కానీ ఆమె కాబోయే భర్త ఇప్పుడు ఖైదీగా ఉన్నాడు. అతను జైలు శిక్షను అనుభవిస్తున్నాడు. ఆశ్చర్యకరమైన, ఆసక్తికరమైన విషయమేమిటంటే.. వీరిద్దరూ బయట ఎప్పుడూ కలవలేదు. మరి వారి ప్రేమ కథ ఎలా మొదలైంది? అన్న విషయాల్లోకెళ్తే..

బ్రిడ్జేట్ వాల్.. తన బంధువు జైలుకు వెళ్ళినప్పుడు, ఆమె అక్కడే తన జీవిత భాగస్వామిని కనుగొనుంటుందని ఆమెకు తెలియదు. 27 ఏళ్ల బ్రిడ్జేట్, టామీ జైలుకు వెళ్లే ముందు, ఆమెను టిక్‌టాక్‌లో ఫాలో అవుతున్నాడని, మెసేజ్‌లు పంపుతున్నాడని చెప్పాడు. కానీ ఆమె మాత్రం అతన్ని ఫాలో కాలేదు సరికదా అతని మెసేజ్ లకు కూడా ఆమె స్పందించలేదు. జైలులో ఉన్నప్పుడు, టామీ.. బ్రిడ్జేట్ పట్ల తన భావాలను ఖైదీగా ఉన్న ఆమె కజిన్ తో పంచుకున్నాడు. అలా అతను బ్రిడ్జేట్‌ను, టామీని కలిపేందుకు ప్రయత్నించాడు. ఆమె మొదటిసారిగా టామీతో ఒక్కసారి కాల్ మాట్లాడడంతోనే కనెక్ట్ అయిపోయారు. అలా రెండు వారాలు ఫోన్‌లో మాట్లాడిన తర్వాత, బ్రిడ్జేట్ జైలుకు వెళ్లి అతన్ని నవంబర్ 11, 2021న మొదటిసారి కలిసింది.

ప్రతి ప్రేమకథలాగే, బ్రిడ్జేట్ ప్రేమకథకు కూడా దారిలో అడ్డంకులు వచ్చాయి. ఐరిష్ ట్రావెలర్ కమ్యూనిటీకి చెందిన బ్రిడ్జేట్ 16 సంవత్సరాల వయస్సులో వివాహం చేసుకున్నారు. కానీ ఆమె అప్పటి భర్త ఆమెతో సరిగా ప్రవర్తించలేదు. దీంతో ఆమె తన సంబంధాన్ని తెగదెంపు చేసుకుంది. తమ ప్రేమ విషయం తెలిసి తన కమ్యూనిటీలోని చాలా మంది వ్యక్తులు జైలులో టామీకి లేఖలు పంపుతున్నారని, ఆమె గురించి చెడుగా మాట్లాడుతున్నారని బ్రిడ్జేట్ పంచుకుంది.