ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపులో అవకతవకలు..బీసీ స్టూడెంట్ యూనియన్ ఆరోపణ

ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపులో అవకతవకలు..బీసీ స్టూడెంట్ యూనియన్ ఆరోపణ

ముషీరాబాద్, వెలుగు: ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపులో అవకతవకలు జరుగుతున్నాయని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ ఆరోపించారు. శనివారం తమ సంఘం ఆధ్వర్యంలో విద్యానగర్​లో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో 2025–26 విద్యాసంవ్సతరానికి బీటెక్ అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతుండగా.. కన్వీనర్ కోట్ల సీట్ల భర్తీలో అక్రమాలు జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ప్రవీణ్, రాహుల్, అర్జున్, వినయ్, సురేందర్, ప్రభు, జగదీశ్, చంద్రశేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.