మీ పాలనలో ఒక్కటన్న సక్కగుందా? 

మీ పాలనలో ఒక్కటన్న సక్కగుందా? 
  • కేసీఆర్ కు వైఎస్ షర్మిల సూటి ప్రశ్న
    వైఎస్ హయాంలో ఒక్కఫోన్ చేస్తే వచ్చే 108 అంబులెన్సులు ఎక్కడ పోయాయి
  • కరోనా రోగుల నుంచి ప్రైవేట్ అంబులెన్సులు అడ్డగోలుగా దోచుకుంటుంటే కనిపించడం లేదా..?
  • మీకు చేతకాకపోతే పాలన కోర్టులకో గవర్నర్ కో అప్పగించాలని సలహా

హైదరాబాద్: సీఎం కేసీఆర్ పై వైఎస్ షర్మిల మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ పాలనలో ఒక్కటన్నా సక్కగుందా చెప్పాలని ప్రశ్నించారు.  వైఎస్ఆర్ హయాంలో ఆపద ఉందని ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు 20 నిమిషాల్లో వచ్చే 108 అంబులెన్సులు  ఎక్కడ పోయాయి CM సారు? అంటూ ట్వట్టర్ లో నిలదీశారు. కరోనా రోగుల నుంచి  ప్రైవేట్ అంబులెన్సులు అడ్డగోలుగా దోచుకొంటుంటే మీకు కనిపించడం లేదా ? కరోనా డెడ్ బాడీలను తరలించేందుకు రూపాయికి 4 రూపాయలు వసూలు చేస్తున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో  మీ పాలనలో ఒక్కటన్న సక్కగుందా? పేషేంట్ల కోసం అంబులెన్సులు లేవు, 
టెస్టులు చేసే కిట్లు లేవు, పట్టించుకొనే డాక్టర్లు లేరు, ఊపిరి నిలిపే ఆక్సిజన్ లేదు, వాక్సిన్ లేదు అనే సమాధానాలు సర్వసాధారణం అయిపోయాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. నువ్వు ఏం చేయలో నీకు కోర్టులు చెప్పాలే, నీకు పరిపాలన అంత చేతకానప్పుడు.. కోర్టులకో లేక గవర్నర్ కో నీ పాలనను అప్పగించు కేసీఆర్ దొర అంటూ వైఎస్ షర్మిల ట్విట్టర్ లో సూచించారు.