ఈ ఏడాది ధన్ తేరస్ అక్టోబర్ 18 లేదా 19న జరుగుతుందా?

ఈ ఏడాది ధన్ తేరస్ అక్టోబర్ 18 లేదా 19న జరుగుతుందా?

దీపావళి ప్రారంభాన్ని సూచించే ధన్ తేరస్ లేదా ధనత్రయోదశి ఈ ఏడాది శనివారం(అక్టోబర్ 18) వస్తుంది. ఈ రోజున, హిందూ భక్తులు లక్ష్మీదేవిని ,కుబేరుడిని పూజిస్తారు. తద్వారా వారు అదృష్టం ,శ్రేయస్సును కోరుకుంటారు. ధన్ తేరస్ నాడు బంగారం, వెండిని కొనుగోలు చేయడం శుభప్రదంగా భావిస్తారు ప్రత్యేకించి లక్ష్మీదేవి, గణేశ విగ్రహాలను కొనుగోలు చేయడం మరింత శుభప్రదంగా భావిస్తారు. 

ధన్​తేరస్ పూజ ముహూర్తం: శనివారం సాయంత్రం 7:16 నుంచి సాయంత్రం 8:20 వరకు 
ప్రదోషకాలం: సాయంత్రం5:48 నుంచి 8:20 సాయంత్రం వరకు
వృషభ కాలం: సాయంత్రం7:16 నుంచి సాయంత్రం9:11 వరకు
త్రయోదశి తిథి ప్రారంభం: అక్టోబర్ 18, 2025న మధ్యాహ్నం 12:18
త్రయోదశి తిథి ముగింపు: అక్టోబర్ 19, 2025న మధ్యాహ్నం 1:51

ఈ నెల (అక్టోబర్) 18న వచ్చే ధన త్రయోదశి (ధన్ తేరస్) నుంచి కుజ, శుక్ర, బుధ గ్రహాలు బాగా అనుకూలంగా మారుతున్నందువల్ల కొన్ని రాశులకు ఒకటికి రెండుసార్లు ధన యోగాలు, మహా భాగ్య యోగాలు పట్టే అవకాశం ఉంది. 

ధన్ తేరస్ నుంచి 45 రోజుల పాటు ఈ రాశుల వారికి ఆదాయం వృద్ధి ,ఆర్థిక సమస్యలు పూర్తిగా పరిష్కారం కావడం, ఆస్తిపాస్తులు కలిసి రావడం, గృహ, వాహన యోగాలు కలగడం, అన్నిటికంటే ముఖ్యంగా మనసులోని ప్రధానమైన కోరికలు నెరవేరడం వంటివి జరుగుతాయి.

 ధన్ తేరస్ రోజున ఇతర రాశులవారితో పాటు ఈ రాశుల వారు కూడా తప్పకుండా లక్ష్మీదేవిని ప్రార్థించడం మంచిది. మేషం, వృషభం, కర్కాటకం, తుల, వృశ్చికం, ధనూ రాశుల వారి జీవితాల్లో ఈ పండుగ సుఖ సంతోషాలను నింపబోతోంది.