కోవిడ్, ఇన్ప్లూయెంజా ఒకే టైమ్లో ఎటాక్ చేస్తాయా ?

కోవిడ్, ఇన్ప్లూయెంజా ఒకే టైమ్లో ఎటాక్ చేస్తాయా ?

ఇన్ప్లూయెంజా  (హెచ్3ఎన్2) వైరస్ కేసులు పెరుగుతుండడం ఇప్పుడు సర్వత్రా ఆందోళన కల్గిస్తోంది. కరోనా మహమ్మారి మాదిరిగా కల్లోలం రేపే అవకాశం ఉందనే ప్రచారం ప్రజల్లో సాగుతోంది.  కోవిడ్ -19, ఇన్ ఫ్లూయెంజా రెండూ ఒకే రకమైన లక్షణాలను కలిగి ఉన్నాయనీ, ఒకే సమయంలో రెండు వైరస్ ల బారిన పడే అవకాశం ఉందని నిపుణలు అంటున్నారు.  రెండూ వైరస్ లు ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతాయని, లక్షణాలు కూడా ఇంచు మించు ఒకేవిధంగా ఉంటాయని ఢిల్లీలోని ప్రైమస్ ఆస్పత్రి పల్మనరీ హెడ్, డాక్టర్ SK ఛబ్రా చెబుతున్నారు. ఇన్ ప్లూయెంజా (హెచ్3ఎన్2) లక్షణాలు కోవిడ్ 19 తరహాలోనే ఉంటాయంటున్నారు. వైరస్ సోకిన వారిలో జలుబు, బాడీ పెయిన్స్, తలనొప్పి ఉంటుందంటున్నారు.

కోవిడ్ 19 బారిన పడిన వారు ఇన్ ప్లూయెంజా (హెచ్3ఎన్2) వైరస్ బారిన పడుతారని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని, వైరస్ సోకే అవకాశం సైతం లేదంటున్నారు వైద్య నిపుణులు.  లక్షణాలు కనిపిస్తే రెండు  రకాల పరీక్షలు చేయించుకోవడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు.  ఇప్పటికే యావత్ ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ తో లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ బాధ నుంచి తేరుకోకముందే కొత్త కొత్త వైరస్ లు పుట్టుకురావడం ఆందోళన కల్గిస్తోంది. తాజాగా H3N2 వైరస్ కేసులు ఇండియాలో పెరుగుతుండడంతో వైద్యారోగ్యశాఖ మరింత అప్రమత్తమైంది. కేసుల నివారణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది.కోవిడ్ లాక్‌డౌన్‌ సమయంలో పిల్లలు ఇన్ ప్లూయెంజా వైరస్‌కు గురికాకపోవడం వల్లే కేసులు అకస్మాత్తుగా పెరిగిపోయాయని ఢిల్లీలోని గంగారామ్ ఆసుపత్రికి చెందిన డాక్టర్ ధీరేన్ గుప్తా చెబుతున్నారు. సాధారణ పరిస్థితుల్లో వైరస్ ప్రాణాంతకం కాదంటున్నారు.