
తెలుగు తెరపై శ్రీదేవి, సూపర్ స్టార్ కృష్ణ సినిమాలకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉండేది. మళ్లీ అదే తెరపై వారి నటవారసులు జోడీ కడితే ఎలా ఉంటుంది? సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన ఓ వార్త వైరల్ అవుతోంది. రాజమౌళి, మహేశ్ బాబు కాంబినేషన్లో ఓ సినిమా రానున్న విషయం తెలిసిందే. అయితే, ఇప్పటివరకు స్టోరీ లైన్ కూడా కన్ఫర్మ్ కాలేదు కానీ హీరోయిన్ ఎవరనే విషయం హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాలో దీపికా పదుకునే హీరోయిన్ అని ఆ మధ్య వార్తలు వచ్చాయి. తాజగా జాన్వీ కపూర్ పేరు తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఎన్టీఆర్ 30లో నటిస్తోంది. ఆ తర్వాత రాంచరణ్ తోనూ ఆడిపాడనుంది.