
గోధుమలు అనగానే మీకు చాల విషయాలు గుర్తొస్తాయి. గోధుమలు ఆరోగ్యానికి చాల మేలు చేస్తాయి, అందుకే గోధుమల పిండితో చపాతీలు, పూరీలు ఇలా రకరకాల వంటలు చేసుకుంటుంటారు. గోధుమలతో చేసే చపాతీలు త్వరగా జీర్ణం అవుతాయి ఇంకా గోధుమల పిండితో చేసే చపాతీలు షుగర్ ఉన్నవారికి షుగర్ లెవెల్స్ స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుంది. అయితే ఈ గోధుమలు కాకుండా గోధుమలలగే ఉండే ఖాప్లి గోధుమ గురించి మీరెప్పుడైనా విన్నారా.. ఈ ఖాప్లి గోధుమ అచ్చం సాధారణ గోధుమలు లాగానే కనిపిస్తాయి. అయితే ఖాప్లి గోధుమల గురించి మీకు తెలియని కొన్ని విషయాలు...
ఖాప్లి గోధుమలు ఎలా ఉంటాయంటే : ఖాప్లి గోధుమలు దాదాపు సాధారణ గోధుమలలాగానే కనిపిస్తాయి. కానీ పోషక విలువల విషయానికొస్తే ఖాప్లి గోధుమలు ఫైబర్, కొవ్వు, ప్రోటీన్లతో సమృద్ధిగా ఉంటాయి. అయితే దీనిలో కాల్షియం, ఐరన్ కంటెంట్ సాధారణ గోధుమల కంటే తక్కువగా ఉంటుంది.
ఖాప్లి గోధుమలలో గ్లూటెన్ : ఖాప్లి గోధుమలు గ్లూటెన్ రహితం కాదు, కానీ తక్కువ ప్రాసెస్ చేయడంతో సాధారణ గోధుమలతో పోలిస్తే ఇందులో గ్లూటెన్ కంటెంట్ తక్కువగా ఉంటుంది.
ఖాప్లి గోధుమల ఆరోగ్య ప్రయోజనాలు: వీటిలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల మిమ్మల్ని ఎక్కువసేపు కడుపు నిండి ఉండేల భావన ఇస్తుంది, అందువల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అలాగే, ఫైబర్ అధికంగా ఉండటం వల్ల కార్బోహైడ్రేట్ల జీర్ణం మెల్లిగా అవుతాయి, ఇంకా రక్తప్రవాహంలోకి గ్లూకోజ్ విడుదలను నెమ్మదిస్తుంది, రక్తంలో చక్కెర స్థాయిని స్థిరంగా ఉంచుతుంది. డయాబెటిక్ ప్రజలకు చాల మంచిది. అలాగే ఈ గోధుమలలో పాలీఫెనాల్స్ పుష్కలంగా ఉంటాయి. క్యాన్సర్, గుండె సంబంధ వ్యాధులు, న్యూరోడెజెనరేటివ్ వ్యాధులను రాకుండా సహాయపడుతుంది.
ఖాప్లి గోధుమలను ఎలా ఉపయోగించాలి: మీరు దీన్ని సాధారణ గోధుమ పిండిలాగా ఉపయోగించి రోటీలు/చపాతీలు చేసుకోవచ్చు. మీరు చేయాల్సిందల్లా 1 కప్పు ఖాప్లి గోధుమ పిండి, సరిపడ ఉప్పు, అవసరమైనంత నీరు కలిపి మెత్తగా కలుపుకోవాలి. పిండిని చిన్న చిన్న భాగాలు చేసి సన్నని రోటీ లాగా పెనం మీద కాల్చాలి. పప్పు లేదా మీకు నచ్చిన వంటతో వేడి వేడిగా రుచికరం ఉంటుంది.
ఖాప్లి గోధుమ అంటే ఏమిటి: ఎమ్మెర్ అని కూడా పిలువబడే ఖాప్లి గోధుమ అనేది గోధుమలలో పురాతన రకం. ఖాప్లి అంటే 'ముదురు' అని అర్థం, దీనిని సాధారణంగా మహారాష్ట్రలో ఎక్కువగా పండిస్తారు. పూర్వీకుల ప్రకారం, ఈ రకమైన గోధుమలను మొదట 10 వేల ఏళ్ల క్రితం మిడిల్ ఈస్ట్ నియోలిథిక్ విప్లవంలో భాగంగా సాగు చేశారు. ఈ గోధుమల బయటి పొర లేత గోధుమ రంగులో చాలా గట్టిగా ఉంటుంది.