చంపడమే పరిష్కారమా?.. మొన్న కుక్కలు, నిన్న కోతులు

చంపడమే పరిష్కారమా?.. మొన్న కుక్కలు, నిన్న కోతులు
  • కామారెడ్డి జిల్లా తరహాలోనే రంగారెడ్డి జిల్లా యాచారంలోనూ కుక్కల మృతి 
  • పాతిపెట్టిన కళేబరాలు వెలికి తీసి పోస్టు మార్టం 
  • భిక్కనూరు మండలం అంతంపల్లిలో 15 కోతుల హతం 
  • ఎక్కడి నుంచి తెచ్చి చంపేశారు..? విష ప్రయోగం చేశారా? ఆరా తీస్తున్న అటవీశాఖ అధికారులు

మూగజీవులను చంపేయడమే సమస్యకు పరిష్కారమా..? కుక్కలు, కోతులను చంపేస్తా రా..? ఇది జంతు ప్రేమికుల ప్రశ్న.. ఇటీవల కామారెడ్డి జిల్లా పాల్వంచ మండల కేంద్రంలో ఫరీద్ పేట్ బండారం ఈశ్వ ర్పల్లి, భవానిపేట్, వాడి గ్రామాలలో 600కు పైగా వీధి కుక్కలపై విష ప్రయోగం చేసి చంపేయడం కలకలం రేపింది. సంబంధిత గ్రామాలలో కొత్తగా ఎన్నికైన సర్పంచుల పర్యవేక్షణలో ఈ సామూహిక హత్య జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై మాచారెడ్డి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్న క్రమంలోనే రంగారెడ్డి జిల్లా యాచారంలోనూ ఇదే తరహా ఘటన చోటు చేసుకోవడం కలకలం రేపింది. 

ఇక్కడ కూడా వంద కుక్కలు వి షప్రయోగం కారణంగా చనిపోయినట్టు ఆరోపణలున్నాయి. విషపు ఇంజెక్ష న్లు, విషాహారం ఇచ్చి చంపి గుట్టుచప్పుడు కాకుండా పాతిపెట్టినట్లు తెలుస్తోంది. 'స్త్రీ యానిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా' ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ మేరకు సర్పంచ్ తో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యాచారం డంపింగ్ యార్డు సమీపంలో కుక్కలను గుంతలో పాతి పెట్టిన చోటనే జేసీబిలో తవ్వించిన చనిపోయిన కుక్కలను ఒక్కొక్కటిగా బయటకు తీసి పోస్టు మార్దూమ్ ను పశు వైద్యుల బృందం నిర్వహిస్తోంది. వాటి శాంపిల్ ను తీసుకొని ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపనున్నారు. 

ఇదిలా ఉండగా నిన్న కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం అంతంపల్లి గ్రామ శివారులో కోతులపై నా విష ప్రయోగం జరిగింది. అంతంపల్లి గ్రామ శివారులో ఓ దాబా హోటల్ 15 కోతులు విగత జీవులుగా పడి ఉన్నాయి. మిగతా కోతులూ ఇబ్బంది పడుతుండటంతో వాటికి పశువైద్యాధికారులతో వైద్యం చేయించారు. ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ వదిలేశారు... విషాహారం ఇచ్చింది ఎవరనే కోణంలో పోలీసులు, అటవీ అధికారులు ఆరా తీ స్తున్నారు.

హామీ అమలు కోసమేనా..?

ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచులు గా గెలిచేందుకు అభ్యర్థులు పలు రకాల హామీలు ఇచ్చారు. ఇందులో ప్రధానంగా కోతులను తరిమే యడం.. వీధి కుక్కల బెడద తగ్గించేందుకు చర్యలు తీసుకోవడం కీలకంగా ఉన్నాయి. అయితే ఎన్నికలు పూర్తయ్యాయి. సమస్య పరిష్కారం కోసం ప్రజలుఅడుగుతుండటంతో కొందరు సర్పంచులే ఇలా కు క్కలపై విష ప్రయోగం చేయించారా..? అన్న అను మానాలు వ్యక్తమవుతున్నాయి. 

కొందరు కోతులు పట్టే వారిని తీసుకొచ్చి పట్టిస్తున్నారు. వాటిని తీసు కెళ్లి దూరంలోని అడవుల్లో వదులుతామని చెబుతూ ఇతర గ్రామాల శివారులో విడిచి పెడుతున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఎక్కడి నుంచో తెచ్చిన కోతులపై విష ప్రయోగం జరిగిందా..? అన్న అను మానాలూ ఉన్నాయి.

కొండముచ్చు వేషంలో కొత్త సర్పంచ్

ఇదిలా ఉండగా కొత్త సర్పంచులు కోతులను తరిమేందుకు కొండ ముచ్చు వేషధారణ చేస్తుం డటం హాట్ టాపిక్ గా మారింది. మహబూబా బాద్ జిల్లా కొత్తపేట సర్పంచ్ కొండముచ్చు వేషం ధరించి చేతిలో కర్రపట్టుకొని తరిమేశా రు. పాలకవర్గం అంతా రంగంలోకి దిగింది. నిర్మల్ జిల్లా కడెం మండలం లింగాపూర్ సర్పంచ్ కుమ్మరి రంజిత్ చింపాంజీ డ్రెస్స్ ధరించి కోతులను తరిమేశారు. చింపాంజీ డ్రెస్ లో సర్పంచ్ గ్రామమంతా తిరుగుతుం డడంతో భయంతో కోతులు పారిపోయాయి. సర్పంచ్.. చింపాంజీ వేషధారణ స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది.

కుక్కలను చంపకుండా ఇలా చేస్తే?

వీధికుక్కల సంఖ్యను నియంత్రించడానికి స్టెరిలై జేషన్ (కుక్కల పునరుత్పత్తి నియంత్రణ), వ్యాక్సి నేషన్ కార్యక్రమాలు నిరంతరాయంగా జరగాలి. గతంలో ఈ ప్రక్రియ నిరంతరాయంగా ఉండేదని పలువురు చెబుతున్నారు. ఇదిలా ఉండగా దేశంలో పెరుగుతున్న కుక్కకాటు ఘటనలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 

నిబంధనల అమలులో విఫలమైన రాష్ట్రాలు భారీ పరిహారం చెల్లించాల్సి ఉంటుందని జస్టిస్ విక్రమ్ నాథ్ నేతృత్వంలోని బెంచ్ హెచ్చరించింది. అలాగే వీధికుక్కలకు ఆహారం పెట్టే వారిపై కూడా బాధ్యతను, జవాబుదారీతనాన్ని నిర్ణయిస్తామని కోర్టు పేర్కొంది. ఈ క్రమంలో స్టెరిలైజేషన్ వ్యాక్సినేషన్ చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.