
టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్(Nikhil Siddarth) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘స్పై(Spy)’. సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ ఆధారంగా వస్తున్న ఈ సినిమాను గ్యారీ బి హెచ్(Garry GH) తెరకెక్కిస్తాన్నాడు. మోస్ట్ యాంటిసిపేటెడ్ ప్రాజెక్టు గా వస్తున్న ఈ థ్రిల్లర్ మూవీ జూన్ 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఐశ్వర్య మీనన్(Aishwarya menon), సన్యా ఠాకూర్(Sanya takur) కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాలో ఆర్యన్ రాజేష్(Aryan Rajesh), అభినవ్ గోమఠం(Abhinav Gomataham) కీలక పాత్రలు పోషిస్తున్నారు.
అయితే తాజాగా ఈ సినిమా నుండి వినిపిస్తున్న ఒక న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అదేంటంటే.. ఈ సినిమాలో టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి(Rana Daggubati) ఒక కీ రోల్ లో కనిపించనున్నాడట. ఈ న్యూస్ తెల్సుకున్న నిఖిల్, రానా అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ ఇద్దరి హీరోలు సింగల్ గా వస్తేనే కలెక్షన్స్ అదిరిపోతాయి. ఆలాంటి ఒకే స్క్రీన్ లో కనిపిస్తే.. అది నెక్స్ట్ లెవలే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ న్యూస్ పై అధికారి ప్రకటన రావాల్సి ఉంది.