ఆమె నిజంగా ఆది ప్రేయసేనా? వైరలవుతున్న లేటెస్ట్ ప్రోమో

ఆమె నిజంగా ఆది ప్రేయసేనా? వైరలవుతున్న లేటెస్ట్ ప్రోమో

జబర్దస్త్(Jabardasth) కామెడీ షోతో ఫుల్ ఫేమస్ అయ్యాడు హైపర్ ఆది(Hyper Adhi). తనడైన పంచులతో, కామెడీ టైమింగ్ తో తెలుగునాట ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ ఫేమ్ తోనే వరుస సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటున్నాడు. ఒక పక్క సినిమాలు.. ఇంకోపక్క షోలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు ఆది. అయితే తాజాగా ఆది పెళ్లి వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. హైపర్ ఆది గతకొన్ని రోజులుగా ఒక యాంకర్ తో పీకల్లోతు ప్రేమలో ఉన్నాడని, త్వరలో ఈ ఇద్దరు పెళ్లిచేసుకోబోతున్నారనే వార్తలు వినిపించాయి. 

ALSO READ :ఇండిపెండెన్స్ డే స్పెషల్గా..హృతిక్ రోషన్ ఫైటర్ మోషన్ పోస్టర్ రిలీజ్

ఇవన్నీ రూమర్స్ అని క్లారిటీ ఇచ్చాడు ఆది. తాజాగా విడుదలైన ఒక షోలో తన ప్రేయసిని పరిచయం చేసిన ఆది.. ఆమె పేరు విహారిక అని తెలిపాడు. ప్రముఖ చానల్లో ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ అనే కామెడీ షోకి సంబంధించిన ప్రోమో ఒకటి తాజాగా రిలీజయింది. ఇందులో హైపర్ ఆది తన లవర్ ను స్టేజిపైకి తీసుకొచ్చి అందరికీ పరిచయం చేశాడు. అది చూసిన చాలా మంది ఒక్కసారిగా షాకయ్యారు.

అయితే ఆమె నిజంగా ఆది లవరేనా? లేక పబ్లిసిటీ కోసమే ఇలాంటి స్టంట్ చేస్తున్నారా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మరి విహారిక నిజంగా హైపర్ ఆది లవరేనా అనేది తెలియాలంటే ఫుల్ ఎపిసోడ్ వచ్చేవరకు ఆగాల్సిందే.