అభిమానులతో విజయ్ వరుస మీటింగ్స్.. పొలిటికల్ ఎంట్రీ కోసమేనా?

అభిమానులతో విజయ్ వరుస మీటింగ్స్.. పొలిటికల్ ఎంట్రీ కోసమేనా?

కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్(Thalapathy Vijay) గత కొంతకాలంగా తమిళనాడు పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం ఆయన రాజకీయ రంగప్రవేశం చేయబోతున్నాడనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. విజయ్ కూడా అప్పుడప్పుడు రాజకీయపరంగా కామెంట్స్ చేస్తూనే ఉంటారు.

ఇక తాజాగా విజయ్ పిలిటికల్ ఎంట్రీపై పలు ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. దానికి కారణం ఇటీవల ఆయన తన అభిమానులతో తరుచూ భేటీ అవుతుండటమే. తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా 15 జిల్లాలకు చెందిన అభిమాన సంఘాలు, ప్రజా సంఘాలతో సమావేశమయ్యారు విజయ్. ఈ సంధర్బంగా.. రాష్ట్రలో ప్రజలు ఎదురుకుంటున్న సమస్యలు, రాజకీయ పరమైన అంశాలపై విజయ్ చర్చించినట్లు సమాచారం. దీంతో విజయ్ పిలిటికల్ ఎంట్రీపై వార్తలు ఊపందుకున్నాయి. విజయ్ కొత్త పార్టీ పెడతారా? లేక.. ఏ పార్టీకైనా మద్దతు ఇస్తారా? అనే అంశాలపై చర్చలు జరుగుతున్నాయి. ఏది ఏమైనా విజయ్ కు సంబందించిన ఓవర్గం అభిమానులు మాత్రం ఈ వార్తలతో సంబరాలు చేసుకుంటున్నారు

అయితే ఈ అత్యవర మీటింగ్స్ పై వినిపిస్తున్న మరో వాదన ఏంటంటే.. ఇది రాజకీయ పరంగా జరిగిన సమావేశం కాదని, కేవలం విజయ్ నిర్వహించే సేవ కార్యక్రమాలపై మాత్రమే ఈ సమావేశంలో చర్చ జరిగిందని చెప్పుకొస్తున్నారు. మరి ఇది నిజంగా విజయ్ పొలిటికల్ ఎంట్రీకి సంబందించిన మీటింగా? లేక ఇంకేదైనానా? అనేది తెలియాలంటే మరి కొన్నిరోజులు ఆగాల్సిందే.