ఇషాన్‌ తుఫాన్

ఇషాన్‌ తుఫాన్

దంచికొట్టిన కిషన్‌, శ్రేయస్‌, రోహిత్‌....  62 రన్స్‌ తేడాతో లంక చిత్తు

లక్నో:  ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌ ఆక్షన్‌‌‌‌ హీరో ఇషాన్ కిషన్ (56 బాల్స్ లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 89) ఇరగదీశాడు. తనలోని షాన్‌‌‌‌దార్‌‌‌‌ ఆటను బయటకు తీస్తూ.. శ్రీలంక బౌలర్లకు చుక్కలు చూపెడుతూ లక్నోలో ఫోర్లు, సిక్సర్ల మోత మోగించాడు. అతనికి తోడు  శ్రేయస్ అయ్యర్(28 బాల్స్ లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 57) దంచికొట్టగా.. తర్వాత బౌలర్లూ రెచ్చిపోవడంతో మూడు మ్యాచ్‌‌‌‌ల సిరీస్‌‌‌‌లో భాగంగా గురువారం జరిగిన ఫస్ట్‌‌‌‌ టీ20లో ఇండియా 62 రన్స్‌‌‌‌ తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది. ఈ వన్‌‌‌‌సైడ్‌‌‌‌ పోరులో తొలుత ఇండియా 20 ఓవర్లలో 199/2 స్కోర్ చేసింది. ఇషాన్, శ్రేయస్‌‌‌‌తో పాటు  రోహిత్ శర్మ (32 బాల్స్ లో 2 ఫోర్లు, 1 సిక్స్ తో 44)  కూడా రాణించాడు. ఛేజింగ్‌‌‌‌లో  భువనేశ్వర్ (2/9), వెంకటేశ్ అయ్యర్ (2/36) సూపర్ బౌలింగ్‌‌‌‌ దెబ్బకు లంక 20 ఓవర్లలో 137/6 మాత్రమే చేసి ఓడింది. చరిత్ అసలంక ( 47 బాల్స్ లో 5 ఫోర్లతో 53 నాటౌట్) టాప్ స్కోరర్.  ఇషాన్‌‌‌‌కు ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌ అవార్డు దక్కింది. రెండో టీ20 ధర్మశాలలో శనివారం జరుగుతుంది. 
ఇషాన్, శ్రేయస్ దూకుడు
ఇండియా ఇన్నింగ్స్‌‌‌‌లో ఇషాన్‌‌‌‌ కిషనే హీరో.  వెస్టిండీస్ తో సిరీస్ లో ఒత్తిడితో కనిపించిన తను ఈ పోరులో మాత్రం ఫుల్ కాన్ఫిడెన్స్ తో బ్యాటింగ్ చేశాడు.  టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ కు దిగిన టీమ్‌‌‌‌కు కెప్టెన్‌‌‌‌ రోహిత్‌‌‌‌తో కలిసి తను మెరుపు ఆరంభం ఇచ్చాడు.  కరుణరత్నే వేసిన మూడో ఓవర్లో హ్యాట్రిక్ ఫోర్లు కొట్టి కాన్ఫిడెన్స్‌‌‌‌ పెంచుకున్న ఇషాన్‌‌‌‌ అక్కడి నుంచి వెనక్కు తగ్గలేదు.  తర్వాత లహిరు బౌలింగ్ లోనూ ఓ ఫోర్, సిక్స్ సాధించాడు. ఓ ఎండ్ లో కిషన్‌‌‌‌ ఖతర్నాక్‌‌‌‌ షాట్లతో  బౌండ్రీలే టార్గెట్‌‌‌‌గా ఆడితే.. మరో ఎండ్ లో హిట్ మ్యాన్ అతడికి సపోర్ట్ ఇస్తూ.. అవకాశం వచ్చినపుడు బాల్‌‌‌‌ను  స్టాండ్స్ కు పంపించాడు. ఈ క్రమంలో ఇషాన్ 30 బాల్స్​లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. 11వ ఓవర్లలోనే స్కోరు వంద దాటింది. అయితే, ఫిఫ్టీకి చేరువైన రోహిత్‌‌‌‌ను12వ ఓవర్లో క్లీన్ బౌల్డ్ చేసిన లాహిరు  ఫస్ట్ వికెట్ కు 111 రన్స్ పార్ట్ నర్ షిప్ బ్రేక్ చేశాడు. అయినా ఇండియా జోరు తగ్గలేదు. వన్‌‌‌‌డౌన్‌‌‌‌లో వచ్చిన  శ్రేయస్ అయ్యర్ తో కలిసి ఇషాన్ ఇన్నింగ్స్ ను ముందుకు నడిపాడు. 16వ ఓవర్లో వరుసగా 6, 4, 4 బాదిన ఇషాన్ సెంచరీ చేసేలా కనిపించాడు. కానీ తర్వాతి ఓవర్లోనే షనక బౌలింగ్ లో భారీ షాట్‌‌‌‌కు ట్రై చేసి జనిత్ కు క్యాచ్ ఇచ్చాడు. స్లాగ్‌‌‌‌ ఓవర్లలో శ్రేయస్ తుఫాన్‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌ ఆడాడు.  లంక బౌలర్లపై ఎదురుదాడికి దిగి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోవడంతో పాటు ఇండియాకు భారీ స్కోరు అందించాడు. 
సూపర్​ బౌలింగ్​
ఇండియా బౌలింగ్​ ధాటికి లంక బ్యాటర్లు బిత్తరపోయారు. ముఖ్యంగా సీనియర్​ పేసర్​ భువనేశ్వర్ సూపర్​ బౌలింగ్​తో రెచ్చిపోవడంతో లంక ఏ ద శలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. భారీ టార్గెట్ ఛేజింగ్‌‌‌‌లో ఫస్ట్ బాల్ కే ఓపెనర్‌‌‌‌ నిసాంక (0)ను గోల్డెన్‌‌‌‌ డకౌట్​ చేసిన భువీ​ లంకకు షాకిచ్చాడు.  తన తర్వాతి ఓవర్లోనే ఓపెనర్‌‌‌‌ కమిల్ మిశ్రా(13)ను కూడా ఔట్​ చేయడంతో   లంక డిఫెన్స్‌‌‌‌లో పడ్డది. భువీతో పాటు బుమ్రా కట్టుదిట్టంగా బౌలింగ్‌‌‌‌ చేయడంతో పవర్ ప్లేలో ఆ జట్టు 29 రన్స్ మాత్రమే చేసింది. మిగతా బౌలర్లూ రాణించడంతో  జనిత్ లియాంగే(11), చండిమల్ (10), షనక (3) పెవిలియన్​కు క్యూ కట్టారు. దాంతో, 60 రన్స్ కే 5 వికెట్లు కోల్పోయిన లంక కష్టాల్లో పడ్డది. మిడిలార్డర్‌‌‌‌లో అసలంక ఒంటరి పోరాటం చేశాడు. చమిక  కరుణరత్నే (21), దుష్మంత చమీర (24 నాటౌట్‌‌‌‌) అతనికి సపోర్ట్‌‌‌‌ ఇచ్చినా.. చేయాల్సిన స్కోరు ఎక్కువగా ఉండటంతో లంకకు ఓటమి తప్పలేదు. 
స్కోర్స్‌‌‌‌
ఇండియా: 20 ఓవర్లలో 199/2 (ఇషాన్‌‌‌‌ 89, శ్రేయస్‌‌‌‌ 57*, షనక 1/19)
శ్రీలంక: 20 ఓవర్లలో 137/6 (అసలంక 53*, భువనేశ్వర్‌‌‌‌ 2/9, వెంకటేశ్‌‌‌‌ 2/36)