MI vs SRH: రివెంజ్ మిస్: ఇషాన్ కిషాన్ ఔట్.. పట్టరాని సంతోషంలో నీతా అంబానీ

MI vs SRH: రివెంజ్ మిస్: ఇషాన్ కిషాన్ ఔట్.. పట్టరాని సంతోషంలో నీతా అంబానీ

గురువారం (ఏప్రిల్ 17) వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో సన్ రైజర్స్ బ్యాటర్ ఇషాన్ కిషాన్ మరోసారి విఫలమయ్యాడు. 3 బంతుల్లో 2 పరుగులే చేసి స్టంపౌటయ్యాడు. అభిషే శర్మ ఔటైన తర్వాత క్రీజ్ లోకి వచ్చిన ఇషాన్.. విల్ జాక్స్ వేసిన ఇన్నింగ్స్ 9 ఓవర్ నాలుగో బంతికి భారీ షాట్ ఆడదామని క్రీజ్ ధాటి ముందుకు వచ్చి షాట్ ఆడాడు. అయితే బంతి బాగా స్పిన్ తిరగడంతో కిషాన్ కు బంతి అందలేదు. దీంతో ముంబై వికెట్ కీపర్ స్టంపౌట్ చేశాడు. 

కిషాన్ ఔట్ కావడంతో ముంబై ఇండియన్స్ 68 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. కిషాన్ ఔట్ అయిన వెంటనే ముంబై ఇండియన్స్ ఓనర్ నీతా అంబానీ సంతోషంతో చప్పట్లు కొట్టడం విశేషం. అంతకముందు సీజన్ లలో కిషాన్ చాలా సీజన్ ల పాటు  ముంబై ఇండియన్స్ తరపున ఆడిన సంగతి తెలిసిందే. 2025 ఐపీఎల్ మెగా ఆక్షన్ లో కిషాన్ ను కొనేందుకు గానీ.. రిటైన్ చేసుకునేందుకు గానీ ఆసక్తి చూపించలేదు. దీంతో ముంబైతో జరగబోయే మ్యాచ్ లో మంచి ఇన్నింగ్స్ ఆడి రివెంజ్ తీర్చుకుంటాడని భావించినా అది జరగలేదు. 

ఈ టోర్నీ ప్రారంభ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ పై సెంచరీ కొట్టి సత్తా చాటిన కిషాన్.. ఆ తర్వాత పూర్తిగా తేలిపోయాడు. ఈ యువ బ్యాటర్ పై నమ్మకముంచి రూ. 11.25 కోట్ల ధరకు కొనుకున్న సన్ రైజర్స్ భారీ మూల్యమే చెల్లించుకుంటుంది. సింగిల్ డిజిట్ కే ఔటయ్యి తీవ్రంగా నిరాశపరుస్తున్నాడు. ప్రస్తుత మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేస్తున్న సన్ రైజర్స్ 14 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది.