కోహ్లీని చూసి నన్ను నేను చాలా మార్చుకోవాలి

కోహ్లీని చూసి నన్ను నేను చాలా మార్చుకోవాలి
  • ఐపీఎల్‌ వల్లే ఫ్రీగా ఆడా: ఇషాన్‌

అహ్మదాబాద్‌‌‌‌: ఐపీఎల్‌‌‌‌లో వరల్డ్‌‌‌‌ క్లాస్​ పేసర్లను ఎదుర్కోవడం వల్లే  డెబ్యూ మ్యాచ్‌‌‌‌లో స్వేచ్ఛగా ఆడగలిగానని టీమిండియా ఓపెనర్‌‌‌‌ ఇషాన్‌‌‌‌ కిషన్‌‌‌‌ అన్నాడు. దానివల్లే కాన్ఫిడెన్స్‌‌‌‌ పెరిగిందన్నాడు. ‘ముంబై ఇండియన్స్‌‌‌‌ తరఫున నెట్స్‌‌‌‌లో బుమ్రా, బౌల్ట్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌ను ఎదుర్కొన్నా. అది నాకు చాలా లాభం చేకూర్చింది. వాళ్ల బౌలింగ్‌‌‌‌లో మంచి షాట్స్‌‌‌‌ కొట్టడం వల్ల నాలో కాన్ఫిడెన్స్​ పెరిగింది.  ప్రపంచ వ్యాప్తంగా ఉండే నాణ్యమైన పేసర్లు ఐపీఎల్‌‌‌‌లో ఆడుతున్నారు. వాళ్లను ఎదుర్కోవడం వల్ల నా డెబ్యూ మ్యాచ్‌‌‌‌ ఈజీగా సాగిపోయింది. ఫ్రీగా ఆడేందుకు కూడా దోహదపడింది’ అని కిషన్‌‌‌‌ పేర్కొన్నాడు. ఎలాంటి ప్రెజర్‌‌‌‌ లేకుండా నేచురల్‌‌‌‌ గేమ్‌‌‌‌ ఆడమని టీమ్‌‌‌‌ మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ చెప్పిందన్నాడు. ‘ఓపెనర్‌‌‌‌గా వెళ్లాలని మ్యాచ్‌‌‌‌కు ముందే చెప్పారు. ఐపీఎల్‌‌‌‌లో ఆడినట్లుగానే స్వేచ్ఛగా ఆడమన్నారు. ఎక్స్‌‌‌‌ట్రా ప్రెజర్‌‌‌‌ తీసుకోవద్దని సూచించారు. అయినా ఫస్ట్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌ కావడంతో గ్రౌండ్‌‌‌‌లోకి వెళ్లే ముందు కాస్త నెర్వస్‌‌‌‌గా ఫీలయ్యా. క్రమంగా గాడిలో పడ్డా. కోహ్లీని ఎప్పుడూ టీవీల్లోనే చూసేవాడిని. కానీ అతనితో కలిసి ఆడటం చాలా గర్వంగా అనిపించింది. గ్రౌండ్‌‌‌‌లో విరాట్‌‌‌‌ యాటిట్యూడ్‌‌‌‌ సూపర్బ్‌‌‌‌. రెండో ఎండ్‌‌‌‌ నుంచి అతను అందించే సహకారం చాలా డిఫరెంట్‌‌‌‌గా ఉంటుంది. కెప్టెన్‌‌‌‌ ఎనర్జీ, అప్పియరెన్స్‌‌‌‌ను చూసి నన్ను నేను చాలా మార్చుకోవాలి. గ్రౌండ్‌‌‌‌లో అతను మాట్లాడే తీరుతో మనలోని ఒత్తిడి మాయమైపోతుంది. ఈ సిరీస్‌‌‌‌లో కోహ్లీని చూసి చాలా నేర్చుకుంటా’ అని ఇషాన్‌‌‌‌ వ్యాఖ్యానించాడు.