ఇషాంత్‌‌‌‌ అద్భుతమైన బౌలింగ్‌‌‌‌.. గుజరాత్‌‌‌‌కు షాక్‌‌‌‌

ఇషాంత్‌‌‌‌ అద్భుతమైన బౌలింగ్‌‌‌‌..   గుజరాత్‌‌‌‌కు షాక్‌‌‌‌

అహ్మదాబాద్‌‌‌‌: అద్భుతమైన బౌలింగ్‌‌‌‌తో గుజరాత్‌‌‌‌ టైటాన్స్​ టాప్‌‌‌‌ హిట్టర్లను కట్టడి చేసి చిన్న స్కోరును కాపాడుకున్నారు. గుజరాత్‌‌‌‌ విక్టరీకి చివరి రెండు ఓవర్లలో 33 రన్స్‌‌‌‌ కావాల్సిన దశలో రాహుల్‌‌‌‌ తెవాటియా (20) మూడు సిక్సర్లతో 21 రన్స్‌‌‌‌ రాబట్టినా, చివరి ఓవర్లో 12 రన్స్‌‌‌‌ను వెటరన్​ పేసర్​ ఇషాంత్‌‌‌‌ శర్మ (2/23)  సూపర్‌‌‌‌గా కాపాడాడు. దీంతో మంగళవారం జరిగిన  బ్యాటర్లు ఫెయిలైన చోట.. ఢిల్లీ క్యాపిటల్స్​బౌలర్లు విజృంభించారు. లీగ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో ఢిల్లీ 5 రన్స్‌‌‌‌ తేడాతో టేబుల్​ టాపర్​ గుజరాత్‌‌‌‌​కు షాకిచ్చింది. టాస్‌‌‌‌ గెలిచిన ఢిల్లీ 20 ఓవర్లలో 130/8 స్కోరు చేసింది. అమన్‌‌‌‌ హకీమ్‌‌‌‌ ఖాన్‌‌‌‌ (44 బాల్స్‌‌‌‌లో 3 ఫోర్లు, 3 సిక్స్‌‌‌‌లతో 51), అక్షర్‌‌‌‌ పటేల్‌‌‌‌ (37), రిపల్‌‌‌‌ (23)  రాణించారు. మహ్మద్‌‌‌‌ షమీ (4/11) చెలరేగాడు. తర్వాత గుజరాత్‌‌‌‌ 20 ఓవర్లలో 125/6 స్కోరుకే పరిమితమైంది. హార్దిక్‌‌‌‌ పాండ్యా (59 నాటౌట్‌‌‌‌), అభినవ్‌‌‌‌ మనోహర్‌‌‌‌ (26) పోరాడారు.  షమీకి ‘ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌’ అవార్డు లభించింది. 

షమీ దెబ్బ..

ముందుగా బ్యాటింగ్‌‌‌‌కు దిగిన డీసీని పేసర్‌‌‌‌ షమీ కోలుకోలేని దెబ్బకొట్టినా.. అమన్‌‌‌‌ హకీమ్‌‌‌‌ హాఫ్‌‌‌‌ సెంచరీతో ఆదుకున్నాడు. ఇన్నింగ్స్‌‌‌‌ తొలి బాల్‌‌‌‌కే ఫిల్‌‌‌‌ సాల్ట్‌‌‌‌ (0)ను షమీ ఔట్‌‌‌‌ చేస్తే.. రెండో ఓవర్‌‌‌‌లో రషీద్‌‌‌‌ ఖాన్‌‌‌‌ (1/28) సూపర్‌‌‌‌ త్రోకు కెప్టెన్‌‌‌‌ వార్నర్‌‌‌‌ (2) రనౌటయ్యాడు. షమీ తన తర్వాతి ఓవర్లలో  రిలీ రోసోవ్‌‌‌‌ (8), మనీష్‌‌‌‌ పాండే (1), ప్రియమ్‌‌‌‌ గార్గ్‌‌‌‌ (10)ను ఔట్‌‌‌‌ చేసి ట్రిపుల్‌‌‌‌ స్ట్రోక్‌‌‌‌ ఇచ్చాడు. దీంతో ఢిల్లీ 23 రన్స్‌‌‌‌కే సగం టీమ్‌‌‌‌ పెవిలియన్‌‌‌‌కు వెళ్లిపోయింది. ఈ దశలో అక్షర్‌‌‌‌, హకీమ్‌‌‌‌ ఖాన్‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌ను చక్కదిద్దారు. పదో ఓవర్‌‌‌‌లో అక్షర్‌‌‌‌ ఇచ్చిన క్యాచ్‌‌‌‌ను లాంగాఫ్‌‌‌‌లో మిల్లర్‌‌‌‌ డ్రాప్‌‌‌‌ చేశాడు. అయితే, 14వ ఓవర్‌‌‌‌లో అక్షర్‌‌‌‌ను ఔట్‌‌‌‌ చేసిన  మోహిత్‌‌‌‌ శర్మ (2/33) ఆరో వికెట్‌‌‌‌కు 50 రన్స్‌‌‌‌ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌షిప్‌‌‌‌ను ముగించాడు.  ఇక్కడి నుంచి హకీమ్‌‌‌‌ వేగంగా ఆడాడు. 16వ ఓవర్‌‌‌‌లో 4, 6 కొట్టాడు. తర్వాతి ఓవర్‌‌‌‌లో రిపల్‌‌‌‌ పటేల్​ మూడు బౌండ్రీలతో 16 రన్స్‌‌‌‌ రాబట్టడంతో డీసీ స్కోరు 100 దాటింది. 18వ ఓవర్‌‌‌‌లో హకీమ్‌‌‌‌ సిక్స్‌‌‌‌తో 41 బాల్స్‌‌‌‌లో హాఫ్‌‌‌‌ సెంచరీ ఫినిష్‌‌‌‌ చేశాడు. 19వ ఓవర్‌‌‌‌లో సిక్స్‌‌‌‌ కొట్టి ఔట్‌‌‌‌కావడంతో ఏడో వికెట్‌‌‌‌కు 53 రన్స్‌‌‌‌ భాగస్వామ్యం ముగిసింది. చివరి ఓవర్‌‌‌‌లో మోహిత్‌‌‌‌.. రిపల్‌‌‌‌ పటేల్‌‌‌‌ను ఔట్‌‌‌‌ చేసి ఐపీఎల్‌‌‌‌లో వందో వికెట్‌‌‌‌ను సాధించాడు. 

బౌలర్లు అదుర్స్‌‌‌‌..

చిన్న టార్గెట్‌‌‌‌ ఛేజింగ్‌‌‌‌లో గుజరాత్‌‌‌‌కు సరైన ఆరంభం దక్కలేదు. డీసీ బౌలర్లు లైన్‌‌‌‌ అండ్‌‌‌‌ లెంగ్త్‌‌‌‌కు కట్టుబడటంతో సాహా (0), శుభ్‌‌‌‌మన్‌‌‌‌ గిల్‌‌‌‌ (6), విజయ్‌‌‌‌ శంకర్‌‌‌‌ (6), డేవిడ్‌‌‌‌ మిల్లర్‌‌‌‌ (0) ఔటయ్యారు. దీంతో 32/4తో కష్టాల్లో పడిన జట్టును  హార్దిక్‌‌‌‌, అభినవ్‌‌‌‌ మనోహర్‌‌‌‌ ఆదుకునే ప్రయత్నం చేశారు.  ఈ ఇద్దరు సింగిల్స్‌‌‌‌కే పరిమితం కావడంతో సగం ఓవర్లలో జీటీ 49/4కే పరిమితమైంది. తర్వాత కూడా పేస్‌‌‌‌–స్పిన్‌‌‌‌ కాంబినేషన్‌‌‌‌తో వార్నర్‌‌‌‌ వీరిని కట్టడి చేశాడు. ఈ క్రమంలో దాదాపు ఆరు ఓవర్లలో పాండ్యా మూడు ఫోర్లు మాత్రమే కొట్టాడు. 44 బాల్స్‌‌‌‌లో పాండ్యా హాఫ్‌‌‌‌ సెంచరీ చేయగా, 18వ ఓవర్లో  మనోహర్‌‌‌‌ ఔట్‌‌‌‌ కావడంతో ఐదో వికెట్‌‌‌‌కు 62 రన్స్‌‌‌‌ పార్ట్​నర్​షిప్​ బ్రేక్​ అయింది. అన్రిచ్​ వేసిన  తర్వాతి ఓవర్లో తెవాటియా హ్యాట్రిక్​ సిక్సర్లతో  జీటీని రేసులోకి తెచ్చాడు. కానీ, చివరి ఓవర్లో  అతడిని ఔట్​చేసి ఆరు రన్సే ఇచ్చిన ఇషాంత్​ ఢిల్లీని గెలిపించాడు.