
షాకింగ్ రిపోర్టు..ప్రపంచంలో ఇస్లాం మతం అత్యంత వేగంగా విస్తరిస్తోంది.. నాల్గో స్థానంలో హిందూ మతం..కేవలం పదేళ్లలో ముస్లిం జనాభా 347 మిలియన్లు పెరిగింది. ఇది ప్రపంచంలోని అన్ని మతాల పరంగా జనాభా చూస్తే గణనీయమైన మార్పు. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మతం ఇస్లాం.. హిందూ మతం నాల్గవ స్థానంలో ఉందని వెల్లడించింది ఓ అధ్యయనం. ఈ రిపోర్టులు 2010 నుంచి 2020 వరకు ప్రపంచ మత జనాభాలో మార్పులను విశ్లేషించాయి.
ఇస్లాం వేగవంతమైన వృద్ధి: ముస్లిం జనాభా 2010 నుంచి 2020 వరకు 347 మిలియన్లు పెరిగి, 2 వందలకోట్లకు చేరింది. ఇది ఇతర మతాలన్నింటినీ కలిపినా వాటికంటే ఎక్కువ వృద్ధి. దీనికి ప్రధాన కారణం అధిక జనన రేటు ,యువ జనాభా. మత మార్పిడి మాత్రం దీని వృద్ధికి పెద్దగా దోహదపడలేదు. 2060 నాటికి ఇస్లాం క్రైస్తవ మతాన్ని అధిగమించే అవకాశం ఉందంటున్నాయి రిపోర్టులు.
హిందూ మతం స్థిరమైన వృద్ధి: హిందూ జనాభా దాదాపు ప్రపంచ జనాభా వృద్ధి రేటుతోనే పెరిగింది. 2010 నుంచి 2020 వరకు 126 మిలియన్లు పెరిగి, 120కోట్లకు చేరింది. ప్రపంచ జనాభాలో హిందువుల శాతం 14.9శాతం దగ్గర స్థిరంగా ఉంది.
క్రైస్తవ మతం తగ్గింది: క్రైస్తవ మతం ఇప్పటికీ ప్రపంచంలోనే అతిపెద్ద మతం అయినప్పటికీ 230కోట్ల జనాభా కలిగి ఉంది. అయినా దాని వాటా తగ్గింది. మత మార్పిడులు ,జనన రేట్లు తక్కువగా ఉండటం వల్ల 2010 నుంచి 2020 వరకు 1.8 శాతం తగ్గింది.
మతపరంగా సంబంధం లేనివారు : మతపరంగా సంబంధం లేని వ్యక్తుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది.ప్రపంచ జనాభాలో మూడవ అతిపెద్ద సమూహంగా ఉంది. ఈ రిపోర్టులు ప్రపంచంలో మతపరమైన కూర్పులో జరుగుతున్న ముఖ్యమైన మార్పులను హైలైట్ చేస్తున్నాయి.