
ఇరాన్ లోని డెజ్‌ఫుల్ ఎయిర్ పోర్టులోని విమానాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశామని ఇజ్రాయెల్ తెలిపింది. ఆ దేశానికి చెందిన రెండు ఎఫ్–5 ఫైటర్ జెట్లను ధ్వంసం చేశామని చెప్పింది. అందుకు సంబంధించిన వీడియోను ఇజ్రాయెల్ విడుదల చేసింది.
ఇరాన్ సైన్యం యుద్ధంలో ఉపయోగించిన రెండు ఎఫ్–14 టామ్ క్యాట్‌లను గతంలో ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది. అయితే, ఈ విమానాలు యుద్ధానికి అనువైనవో, కాదో స్పష్టంగా తెలియదు. వీటి విడిభాగాల కొరతతో ఉపయోగించడం లేదు. ఇరాన్ లోని ఇస్ఫహాన్ విమానాశ్రయం చుట్టూ ఉన్న ఇతర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నామని ఇజ్రాయెల్ పేర్కొంది. అయితే, ఇరాన్ మాత్రం విమానాలు, ఇతర సామగ్రిని నష్టపోయినట్టు అంగీకరించలేదు.