
ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడులు పక్కాగా.. వ్యూహాత్మకంగా.. టార్గెట్ గా ఉంటున్నాయి. ఎంతలా అంటే.. 2 వేల కిలోమీటర్ల దూరంలోని ఓ మనిషిని టార్గెట్ చేసి మిస్సైల్స్ ప్రయోగిస్తే.. కచ్చితంగా ఆ బాంబులు అతన్నే లేపేస్తు్న్నాయి.. ఇలాంటి దాడులతోనే ఇప్పుడు ఇరాన్ అల్లాడిపోతుంది. కీలకమైన, పవర్ ఫుల్ లీడర్లను కోల్పోతుంది. లేటెస్ట్ గా ఇరాన్ దేశంలోనే పవర్ ఫుల్ లీడర్.. ఇరాన్ సైన్యాన్ని మొత్తం నడిపించే మిలటరీ కమాండర్ అలీ షాద్మానీని చంపేసింది ఇజ్రాయెల్. ఈ విషయాన్ని ఆ దేశమే ప్రకటించింది.
ఇరాన్ మిలటరీ కామాండర్ అలీ షాద్మానీ హత్య కోలుకోలేని దెబ్బగానే చెప్పొచ్చు. ఎందుకంటే.. ఆయన ఆర్మీలోనే శక్తివంతమైన లీడర్. అంతేకాదు ఇరాన్ అధ్యక్షుడు అయతుల్లా ఖమేనీకి అత్యంత సన్నిహితుడు. ఇరాన్ ఆర్మీకి నాయకత్వం వహించటమే కాకుండా.. ఇరాన్ దేశంలో శక్తివంతంగా ఉండే ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కు కూడా నాయకత్వం వహించాడు. ఇరాన్ దేశానికి రెండు కళ్లు లాంటి ఈ రెండు సంస్థలకు, వ్యవస్థలకు నాయకత్వం వహించిన వ్యక్తి షాద్మానీ.
ఐదు రోజులుగా షాద్మానీ టార్గెట్ గా ఇజ్రాయెల్ నిఘా పెట్టింది. జూన్ 17వ తేదీ షాద్మానీ కదలికలపై ఇజ్రాయెల్ కు సమాచారం వచ్చింది. టెహ్రాన్ సిటీలోని ఆర్మీ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో షాద్మానీ ఉన్నాడనే పక్కా సమాచారంతో.. ఇజ్రాయెల్ మిస్సైల్, డోన్లతో దాడి చేసింది. ఈ దాడిలో కమాండ్ సెంటర్ లోని షాద్మానీతోపాటు చాలా మంది చనిపోయినట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది.
ఇరాన్ ఆర్మీకి సీనియర్ కమాండర్ గా.. అధ్యక్షుడు అయతుల్లా ఖమేనీకి కుడి భుజంగా పని చేస్తున్నాడు షాద్మానీ. ఇరాన్ అధ్యక్షుడు తర్వాత అంత పవర్ ఫుల్ లీడర్ షాద్మానీనే.. అలాంటి వ్యక్తిని ఇజ్రాయెల్ లేపేయటం.. ఇప్పుడు ఇరాన్ దేశానికి.. ఆ దేశ సైన్యానికి షాక్ కు గురి చేస్తుంది. ఐదు రోజులుగా కీలకమైన చాలా మంది ఉన్నతాధికారులను కోల్పోయింది. ఈ పరిణామాలతో ఇరాన్ దేశంలోని ప్రజల్లోనూ భయాందోళనలు నెలకొన్నాయి. ఇరాన్ దేశం ఇంత బలహీనంగా ఉందా.. ఐదు రోజుల్లో ఇంత భారీ నష్టమా.. అసలు ఇరాన్ దేశం ఏం చేస్తోంది.. ఏం చేయబోతుంది అనే భయం కూడా అక్కడి ప్రజల్లో నెలకొన్నాయి. ఇజ్రాయెల్ దేశాన్ని ఎదిరించే సత్తా, దైర్యం, దమ్ము ఇరాన్ దగ్గర లేవనే క్లారిటీకి ఇరాన్ ప్రజలు వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే విషయాన్ని ఇజ్రాయెల్ ప్రకటిస్తుండటం విశేషం.
For the second time in 5 days— the IDF has eliminated Iran’s War-Time Chief of Staff, the regime’s top military commander.
— Israel Defense Forces (@IDF) June 17, 2025
Ali Shadmani, Iran’s senior-most military official and Khamenei’s closest military advisor, was killed in an IAF strike in central Tehran, following precise… pic.twitter.com/Bq6Z49zeCj