గాజాపై ఇజ్రాయెల్ దాడి.. 11 మంది మృతి

గాజాపై ఇజ్రాయెల్ దాడి.. 11 మంది మృతి
  • చనిపోయిన వారిలో ఎక్కువ మంది మహిళలు, చిన్న పిల్లలు

దేర్ అల్-బలా: గాజా స్ట్రిప్‌‌‌‌‌‌‌‌పై ఇజ్రాయిల్ ఆదివారం వరకు జరిపిన దాడుల్లో 11 మంది మరణించారు. వీరిలో ఎక్కువ మంది మహిళలు, చిన్న పిల్లలు ఉన్నారని స్థానిక ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఉత్తర గాజాలోని ఇండోనేషియన్ ఆస్పత్రి వద్ద జరిగిన ఒక దాడిలో 16 ఏండ్ల బాలుడు మరణించాడని వారు పేర్కొన్నారు. ఇజ్రాయిల్ సైన్యం కేవలం టెర్రరిస్టులనే లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నామని చెబుతోందని.. కానీ, పౌరులను కూడా హతమారుస్తోందని హమాస్​పేర్కొంటోంది. అయితే, హమాస్ ఉగ్రవాదులు జనసాంద్రత కలిగిన ప్రాంతాలలో ఉండటం వల్ల పౌరుల మరణాలు సంభవిస్తున్నాయని ఇజ్రాయిల్ ఆరోపిస్తోంది. కాగా, తాజాగా జరిపిన దాడులపై ఇజ్రాయిల్ స్పందించలేదు.

 ఇజ్రాయిల్, హమాస్ మధ్య 2023 అక్టోబర్ 7న యుద్ధం మొదలైంది. హమాస్ నేతృత్వంలోని ఉగ్రవాదులు దక్షిణ ఇజ్రాయిల్‌‌‌‌‌‌‌‌పై దాడి చేసి.. సుమారు 1,200 మందిని.. అందులోనూ ఎక్కువగా పౌరులను చంపి, 251 మందిని బందీలుగా తీసుకున్నారు. ప్రస్తుతం 59 మంది బందీలు గాజాలో ఉన్నారు. అయితే, వీరిలో మూడవ వంతు మాత్రమే బతికి ఉన్నారని భావిస్తున్నారు. ఇజ్రాయిల్ దాడులలో గాజాలో ఇప్పటివరకు 52,800 మంది పాలస్తీనియన్లు మరణించారని, వీరిలో ఎక్కువ మంది మహిళలు, పిల్లలు ఉన్నారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మరోవైపు బందీలను విడుదల చేయాలని డిమాండ్​ చేస్తూ.. గాజాకు ఇజ్రాయెల్ 10 వారాల పాటు ఆహారం, మందులు, అత్యవసర ఆశ్రయం సహా అన్ని దిగుమతులను నిలిపివేసింది.