ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధం : గాజా సరిహద్దుల్లో గుట్టలుగా 3 వేల శవాలు

ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధం : గాజా సరిహద్దుల్లో గుట్టలుగా 3 వేల శవాలు

ఇజ్రాయిల్ - హమాస్ ఉగ్రవాదుల మధ్య యుద్ధం ఐదవ రోజుకు చేరుకుంది. ఇజ్రాయెల్ కొనసాగుతున్న వైమానిక దాడులతో పాటు గాజాలో భూదాడిని ప్రారంభించడం ద్వారా దాడిని ఉధృతం చేయడానికి ఇరుదేశాలు సిద్ధమవుతున్నాయి. అందులో భాగంగా ఇజ్రాయెల్ సైన్యం దక్షిణ ఇజ్రాయిల్‌లో తన సభ్యులను సమీకరిస్తోంది. భారీ సైనిక సామగ్రితో పాటు రిజర్వ్ దళాలకు చెందిన మరింత మంది సభ్యులను కూడా ఇప్పటికే పిలిపించారు. ఇజ్రాయెల్‌పై హమాస్ ఆకస్మిక దాడి, గాజాలో ప్రతీకార వైమానిక దాడులతో కలిపి ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 3వేలు దాటింది.

గాజా సరిహద్దులో ఉన్న దక్షిణ ఇజ్రాయిల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రకటించింది. ఇజ్రాయిల్ రాత్రి సమయంలో చేసిన వైమానిక దాడులు గాజాలోని కిజాన్-అన్-నజ్జర్ పరిసరాల్లోని హమాస్ మిలిటరీ కమాండర్ మొహమ్మద్ దీఫ్ తండ్రి ఇంటిని లక్ష్యంగా చేసుకున్నట్లు పలు నివేదికలు సూచిస్తున్నాయి.