ఇజ్రాయెల్కు మద్దతుగా అమెరికా.. మధ్యధరాకు రెండో యుద్ద నౌక

ఇజ్రాయెల్కు మద్దతుగా అమెరికా.. మధ్యధరాకు రెండో యుద్ద నౌక

ఇజ్రాయెల్ గాజా పై తన యుద్దాన్ని తీవ్రతరం చేస్తోంది. వాయు, సముద్ర, భూమార్గాల్లో ఒకేసారి దాడులకు సిద్దమైంది. ఉత్తర గాజాలోని 1.1 మిలియన్ల నివాసితులను దక్షిణం వైపు ఖాళీ చేయాలని ఆదేశించింది. 
ఇజ్రాయెల్ కు మద్దతుగా అమెరికా రెండో యుద్ధ నౌకను పంపించింది. గాజాపై ఇజ్రాయెల్ దాడులు తీవ్రతరం చేస్తున్న సమయంలో అమెరికా పంపించిన రెండో విమాన వాహన నౌక ఇజ్రాయెల్ కు మద్దతుగా మధ్యధర సముద్రం చేరుకుంది. 

గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ఇప్పటివరకు కనీసం 2వేల 329 మంది పాలస్తీనియన్లు మరణించారు.సుమారు 9వేల మంది గాయపడ్డారు. ఇజ్రాయెల్‌లో మరణించిన వారి సంఖ్య 1300 కు చేరింది. దక్షిణ ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి ప్రారంభించినప్పటి నుంచి 3వేల 400 మందికి పైగా గాయపడ్డారు.