ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంలో 40 మంది విద్యార్థినులు చనిపోయారు. సదరన్ ఇరాన్లోని మినాబ్ సిటీలో ఉన్న ఒక ఎలిమెంటరీ గర్ల్స్ స్కూల్పై ఇజ్రాయెల్ బాంబులేసింది. ఈ దాడిలో 40 మంది విద్యార్థినులు చనిపోయారు. చాలా మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది.
సదరన్ ఇరాన్లోని హోర్మోజ్‌గాన్ ప్రావిన్స్‌లో మినాబ్ సిటీ ఈ బాంబు దాడులతో వణికిపోయింది. ఫిబ్రవరి 28న మధ్యాహ్నం 2 గంటల 45 నిమిషాల సమయంలో ఈ ఘటన జరిగింది. ఇదిలా ఉండగా.. ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాలను కూడా ఇరాన్ టార్గెట్ చేసింది.
సౌదీ అరేబియా, అబుదాబితో సహా 8 దేశాలపై ఇరాన్ మిస్సైల్స్తో అటాక్ చేస్తుండటంతో యూఏఈ, బెహ్రెయిన్, ఖతార్, జోర్డాన్, కువైట్ దేశాలు భయంతో వణికిపోతున్నాయి. బెహ్రయిన్లోని అమెరికా మిలటరీ బేస్పై ఇరాన్ బాంబు దాడులు చేసింది. ఈ దాడి దృశ్యాలు ఇంటర్నెట్లో వైరల్గా మారాయి.
ఖతార్ రాజధాని దోహాలో కూడా రెండు ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించినట్లు ఖతార్ రక్షణ శాఖ ధృవీకరించింది. ఇదిలా ఉండగా.. బెహ్రెయిన్, ఖతార్, జోర్డాన్, కువైట్ దేశాలపై ఇరాన్ అటాక్స్ను సౌదీ అరేబియా తీవ్రంగా ఖండించింది.
Iranian media now report 40 killed and 48 students injured following the strike on a girls’ elementary school in Minab, as rescue and recovery efforts continue. https://t.co/kCR6Gagvip pic.twitter.com/faBFkgFn3D
— Ali Hashem علي هاشم (@Alihashem) February 28, 2026
