ఆగని యుద్ధం.. పాలస్తీనాపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం

ఆగని యుద్ధం.. పాలస్తీనాపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం

గాజా: ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య జరుగుతున్న ఘర్షణలు ఇప్పట్లో ఆగేలా లేవు. గాజాలో వందల మంది ప్రాణాలు కోల్పోయి, వేలాది మంది గాయపడిన వేళ యుద్ధానికి తెరపడుతుందేమనని అందరూ భావించారు. కానీ యుద్ధాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపమని చెప్పిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహు.. గాజాపై దాడులను తీవ్రతరం చేశారు. తాజాగా డజన్ల కొద్దీ బాంబులతో గాజాపై ఇజ్రాయెల్ మరోమారు విరుచుకుపడింది. బార్డర్ గుండా కూడా పాలస్తీనా మీద దాడులను పెంచేందుకు ఇజ్రాయెల్ యత్నిస్తున్నట్లు సమాచారం. కాగా, ఈ ఘర్షణల్లో 197 మంది పాలస్తీనియన్లు చనిపోయారని తెలుస్తోంది. వీరిలో 34 మంది మహిళలు, 58 మంది చిన్నారులు ఉన్నారు. అదే ఇజ్రాయెల్ లో 10 మంది మృతి చెందారని, వీరిలో ఇద్దరు పిల్లలు ఉన్నారని సమాచారం. ఇకపోతే, ఇజ్రాయెల్ దాడుల్లో చాలా ఇళ్లు నేలమట్టం అవడంతో అనేక మంది పాలస్తీనియన్లు నిరాశ్రయలయ్యారని అంతర్జాతీయ మీడియా ద్వారా తెలిసింది.