POEM-3 సక్సెస్తో ఇస్రో ఖాతాలో మరో విజయం.. 75 రోజుల్లో భూమిపైకి మాడ్యుల్ శకలాలు

POEM-3 సక్సెస్తో ఇస్రో ఖాతాలో మరో విజయం.. 75 రోజుల్లో భూమిపైకి మాడ్యుల్ శకలాలు

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) జనవరి 1, 2024న PSLV -C58 ద్వారా X రే పొలారీమీటర్ శాటిలైట్ (XPOSAT) ఉపగ్రహాన్ని అంతరిక్షంలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన కీలక విషయాలను ఇస్రో  శనివారం (జనవరి 27) వెల్లడించింది.XPOSAT  ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టి ఆన్ బోర్డులోని అన్ని ప్రయోగాల లక్ష్యాలను విజయవంతంగా పూర్తి చేసింది. దీంతో ఇస్రో ఖాతాలో మరో విజయం చేరింది. రాబోయే 75 రోజుల్లో  PSLV కక్ష్య ప్రయోగాత్మక మాడ్యూల్ (POEM-3) భూ వాతావరణంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. తర్వాత కాలి బూడిదైపోయే అవకాశం ఉంది. దీని వల్ల PSLV -C58 XPoSat  మిషన్ అంతరిక్షంలో ఎలాంటి శిథిలాలను వదిలి వేయకుండా చూస్తుందని ఇస్రో తెలిపింది. 

X-రే పోలారీమీటర్ శాటిలైట్ ను 650 కిలోమీటర్ల దూరంలో 6 డిగ్రీల వంపుతో కక్ష్యలో ఉంచిన తర్వాత అంతరిక్ష వ్యోమ నౌక నాల్గవ దశను తగ్గించింది. ఇది ఆన్ బోర్డు ప్రయోగాలకు ఉపయోగ పడుతుంది. 

POEM-3లో పేలోడ్స్

1. బెంగుళూరు బేస్డ్ బెల్లాట్రిక్స్ ఏరోస్పేస్ .. రుద్ర 0.3 HPGP,గ్రీన్ మోనో ప్రెపెల్లెంట్ థ్రస్టర్, ARKA-200, హాల్ థ్రస్టర్ల కోసం హీటర్ లెస్ హాలో కాథోడ్ ను పరీక్షించింది. 

2. ముంబైలోని ఇన్ స్పేసిటీ స్పేట్ ల్యాబ్.. (IIT బాంబే చే అభివృద్ది చేయబడిన సంస్థ) గ్రీన్ ఇంపల్స్ ట్రాన్స్ మీటర్(GITA), గ్రీన్ బైప్రొపెల్లెంట్ క్యూబ్ సాట్ ప్రపోల్షన్ యూనిట్ లను పరీక్షించింది. 

3.హైదరాబాద్ కు చెందిన TakeMe2Space దాని రేడియేషన్ షీల్డింగ్ ప్రయోగాత్మక మాడ్యుల్ ను పరీక్షించింది. ఇది Tantalum పూత ప్రభావాన్ని అంచనా వేసేందుకు, CubeSat జీవితకాలాన్ని పెంపొందించేందుకు రూపొందించడం జరిగింది. 

4. తిరువనంతపురం కు చెందిన LBS ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ సహకారంతో ఉమెన్ ఇంజనీర్డ్ శాటిలైట్ ను ప్రయోగించారు. ఇది సోలార్ రేడియన్స్, UV ఇండెక్స్ ను కొలిచేందుకు సహకరిస్తుంది. 

5. ముంబై కి చెందిన కేజే సోమయ్య ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బిలీఫ్ సాట్-0ని పరీక్షించింది. ఇది ఒక రేడియో శాటిలైట్. 

6. ఇస్రో కు చెందిన విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ () రెండు పేలోడ్ లను అంతరిక్షంలోకి పంపింది. అవి 1. ఫ్యుయెల్ సెల్ పవర్ సిస్టమ్(VSSC), 2. సిలికాన్ బేస్డ్ హై ఎనర్జీ సెల్. 

7.అహ్మదాబాద్ కు చెందిన ఫిజికల్ రీసెర్చ్ లాబోరేటరీPOEMలో డస్ట్ ఎక్స్ పెరిమెంట్ (DEX)ని పంపించింది. ఇది అంతర్ గ్రహ ధూళి ని కొలవడానికి రూపొందించబడింది. 

అన్ని పేలోడ్స్ లక్స్యాలను విజయవంతంగా పూర్తి చేసినట్లు స్పేస్ ఏజెన్సీ ప్రకటించింది. అన్ని లక్ష్యాలను సాధించిన తర్వాత రాబోయే POEM కాన్షిఫిగరేషన్ లతో సహా భవిష్యత్ మిషన్ల కోసం డేటాను రూపొందించడానికి POEM -3తో మరిన్ని ప్రయోగాలకు ప్లాన్ చేసినట్లు ఇస్రో తెలిపింది.