ప్రయోగానికి సిద్ధమైన PSLV-C50

ప్రయోగానికి సిద్ధమైన PSLV-C50

రేపటి(గురువారం) PSLV C 50 ప్రయోగానికి ఇవాళ్టినుంచి కౌంట్ డౌన్ జరగనుంది. ఆంధ్రప్రదేశ్  నెల్లూరు జిల్లా శ్రీహరికోట షార్ నుంచి ఈ ప్రయోగం జరపనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటల 41 నిమిషాలకు కౌంట్ డౌన్ ప్రారంభం కానుంది. గురువారం సాయంత్రం 3 గంటల 41 నిమిషాలకు  PSLV C50 ప్రయోగం జరగనుంది. రాకెట్ లాంచింగ్ కు 25 గంటల ముందునుంచి కౌంట్ డౌన్ తో శాటిలైట్ పనితీరు మానిటర్ చేయనున్నారు ఇస్రో అధికారులు.

PSLVకి సంబంధించి ఇది 52వ ప్రయోగం. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ … సెకండ్ లాంచ్ ప్యాడ్ నుంచి ప్రయోగం జరపనున్నారు. PSLV C50 లాంచింగ్ వెహికల్ తో … కమ్యూనికేషన్ శాటిలైట్ CMS-1 ను నింగిలోకి పంపనున్నారు. భారత భూభాగం, అండమాన్ నికోబార్, లక్షద్వీప్ ఐలండ్స్ నుంచి.. శాటిలైట్ సహాయంతో .. ఎక్స్ టెండెడ్ సీ బ్యాండ్ కవరేజీతో కమ్యూనికేట్ కావొచ్చు.

ఢిల్లీ బాట పట్టిన కాంగ్రెస్ నేతలు