
ఇటీవల నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్–2 త్వరలోనే చంద్రునిపై ల్యాండ్ అవబోతోంది. ఈ దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూసే అవకాశం వస్తే? వస్తే ఏంటండీ.. ఇస్రో స్పేస్ క్విజ్ కాంపిటీషన్ రూపంలో వచ్చేసింది. అయితే ఈ ఆపర్చునిటీని అందుకోవాలంటే మీరు స్టూడెంట్ అయి ఉండి క్విజ్ కాంపిటీషన్లో పాల్గొనాలి. టాప్‌లో నిలిచిన వారిని సెలెక్ట్ చేసి చంద్రయాన్–2 ల్యాండింగ్‌ను డైరెక్ట్‌గా చూసే అవకాశం కల్పిస్తారు. అది కూడా ప్రధానమంత్రితో కలిసి.. మరెందుకాలస్యం..
రీడ్ డీటెయిల్స్ నౌ!
అంతరిక్ష ప్రయోగాలపై అవగాహన కల్పించేందుకు ఇస్రో, భారత ప్రభుత్వ వెబ్సైట్ MyGov.in సంయుక్తంగా ఆగస్టు 10 నుంచి 20 వరకు ఆన్లైన్లో ఈ స్పేస్ క్విజ్ కాంపిటీషన్‌ను నిర్వహిస్తున్నాయి. డ్యురేషన్ 10 నిమిషాలు. గరిష్టంగా 20 ప్రశ్నలుంటాయి. ఆగస్టు పదో తేదీనే క్విజ్ ఓపెన్ అవుతుంది. ముందుగా వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాలి. క్విజ్ ముగిసేలోపు ఎప్పుడైనా, ఎక్కడినుంచైనా పోటీలో పాల్గొనవచ్చు.
క్విజ్ వివరాలు
భారత పౌరులై ఉండి ప్రస్తుతం 8 నుంచి పదోతరగతి చదువుతున్న విద్యార్థులు క్విజ్‌లో పోటీపడేందుకు అర్హులు. ఒక్కరు ఒకసారి మాత్రమే టెస్ట్ రాయాలి. క్విజ్‌ను మధ్యలో ఆపడం/నిలపడం కుదరదు. అతి తక్కువ టైమ్‌లో ఎక్కువ సమాధానాలు రాసిన వారిని సెలెక్ట్ చేస్తారు. ఏ ఇద్దరికైనా సమాన మార్కులు వచ్చినప్పుడు తక్కువ సమయంలో ఆన్సర్స్ రాసిన వారిని పరిగణనలోకి తీసుకుంటారు. ఇక్కడా సమానంగా నిలిస్తే ర్యాండమ్‌గా సెలెక్ట్ చేస్తారు. తల్లిదండ్రులు, సంరక్షకులు ప్రశ్నలను ట్రాన్స్‌లేట్ చేయవచ్చు కానీ సమాధానాలు చెప్పకూడదు. పిల్లాడితో నిజాయితీగా టెస్ట్ రాయించాలని ఇస్రో కోరుతోంది.
వెబ్సైట్: www.quiz.mygov.in
–వెలుగు ఎడ్యుకేషన్ డెస్క్
స్పేస్ క్విజ్ లైవ్ ల్యాండింగ్ చూసే అద్భుత అవకాశం
ప్రతి రాష్ర్టం/కేంద్రపాలిత ప్రాంతం నుండి టాప్‌లో నిలిచిన ఇద్దరు విద్యార్థులకు సెస్టెంబర్ 7న బెంగళూరులోని ఇస్రో కేంద్రంలో ప్రధానమంత్రితో కలిసి చంద్రయాన్–2 ల్యాండింగ్‌ను ప్రత్యక్షంగా చూసే అవకాశం కల్పిస్తారు. క్విజ్‌లో పాల్గొన్నవారు పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌లు డౌన్లోడ్ చేసుకునే అవకాశం కూడా ఉంది.