ఇస్రో (URSC)లో సైంటిస్ట్, మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలు:అర్హతలు, అప్లికేషన్ వివరాలు ఇవే!

ఇస్రో (URSC)లో సైంటిస్ట్, మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలు:అర్హతలు, అప్లికేషన్ వివరాలు ఇవే!

ఇస్రో య.ఆర్.రావు శాటిలైట్ సెంటర్ (ఇస్రో, యూఆర్ఎస్​సీ), బెంగళూరు సైంటిస్ట్/ ఇంజినీర్ అండ్ మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ ప్రక్రియ మార్చి 23న ప్రారంభమై ఏప్రిల్ 12న ముగుస్తుంది. 

మొత్తం ఖాళీలు: 04. 

విభాగాల వారీగా ఖాళీలు: సైంటిస్ట్/ ఇంజినీర్ –ఎస్ సీ 2, సైంటిస్ట్/ ఇంజినీర్ ఎస్​డీ 1, మెడికల్ ఆఫీసర్ 1. 

ఎలిజిబిలిటీ
సైంటిస్ట్– ఎస్​సీ: కనీసం 65 శాతం మార్కులతో ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ / ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ / ఇండస్ట్రియల్ మేనేజ్‌మెంట్ / ప్రొడక్షన్ ఇంజినీరింగ్ లేదా అనుబంధ శాఖల్లో బీఈ/ బి.టెక్ లేదా సమాన డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. 

సైంటిస్ట్– ఎస్​డీ: థిన్ ఫిల్మ్స్ / మెటీరియల్ సైన్స్ / అప్లైడ్ ఆప్టిక్స్ / మెటలర్జీలో పీహెచ్​డీ పూర్తిచేసి ఉండాలి. ప్రీ క్వాలిఫికేషన్​లో బీఈ/ బి.టెక్, ఎంఎస్సీ/ ఎంటెక్​లో  కనీసం 60 శాతం మార్కులు సాధించి ఉండాలి. 

మెడికల్ ఆఫీసర్ –ఎస్​సీ: ఎంబీబీఎస్ పూర్తిచేసి రిజిస్ట్రేషన్ తర్వాత 2 సంవత్సరాల అనుభవం ఉండాలి.

గరిష్ట వయోపరిమితి: 35 ఏండ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: మార్చి23. 

లాస్ట్ డేట్: ఏప్రిల్ 12. 

సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, స్క్రీనింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

పూర్తి వివరాలకు వెబ్​సైట్ www.ursc.gov.inను సందర్శించండి.