విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (వీఎస్ఎస్సీ) 2026–-27 విద్యాసంవత్సరానికిగాను అప్రెంటీస్ ట్రైనీ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టు పేరు: గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ & టెక్నీషియన్ అప్రెంటీస్.
మొత్తం ఖాళీలు: 460 (273 గ్రాడ్యుయేట్ + 187 టెక్నీషియన్).
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 65 శాతం మార్కులు లేదా 6.83 సీజీపీఏతో సంబంధిత విభాగంలో బీఈ/ బి.టెక్, హోటల్ మేనేజ్మెంట్/ క్యాటరింగ్ టెక్నాలజీలో డిగ్రీ/ ఏదైనా డిగ్రీ/ డిప్లొమా పూర్తిచేసి ఉండాలి.
గరిష్ట వయోపరిమితి: 40 ఏళ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
వాక్ఇన్ సెలెక్షన్: జులై 25.
సెలెక్షన్ ప్రాసెస్: డాక్యుమెంట్ వెరిఫికేషన్, అకడమిక్ మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ vssc.gov.inను సందర్శించండి.
